Vangaveeti Radhakrishna met Chief Minister Chandrababu: టీడీపీలో పార్టీ కోసం పని చేసి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి వారి స్థాయికి తగ్గ పదవుల్ని ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేయడంలో నాగబాబుకు నిరాశ ఎదురు కావడంతో ఆయనను మంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా పార్టీ కోసం పని చేసిన వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. నిజానికి మంత్రివర్గంలో ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీగా చేసిన .. వంగవీటి రాధాకృష్ణకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నాగబాబుకు కేటాయించాల్సి రావడంతో చంద్రబాబు పిలిపించి మట్లాడినట్లుగా తెలుస్తోంది.
గత రెండు ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతం ప్రచారం చేసిన వంగవీటి రాధా
వంగవీటి రాధాకృష్ణ 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన టిక్కెట్ అడగలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణకు మంచి పదవి ఇచ్చి గౌరవిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఆయనకు మంచి పదవి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణను పిలిపించుకుని ఎమ్మెల్సీ పదవిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్ ర్యాంక్ ఉన్న హోదా ఉన్న బాధ్యతలు కూడా అప్పగిస్తామని తెలిపినట్లుగా తెలుస్తోంది.
Also REad: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
పలువురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా - త్వరలో ఉప ఎన్నికలు
ఇటీవల పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు.అలాగే మరికొంత మంది రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉపఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలను మళ్లీ రాజీనామాలు చేసే వారికి ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.అలాంటి ఒప్పందంతోనే రాజీనామాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్సీ పదవుల్ని పార్టీ కోసం పని చేసిన వారికి కేటాయించే అవకాశం ఉంది.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎంపీ సీటు త్యాగం చేయడంతో నాగబాబుకు మంత్రి పదవి
నాగేంద్రబాబును మంత్రి పదవికి ఖరారు చేయడం అనూహ్యంగా మారింది. ఆయన అనకాపల్లి ఎంపీసీటులో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు సీఎం రమేష్ కు వెళ్లడంతో ఆయన పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. సీటు త్యాగం చేసినందుకు ఆయనకు న్యాయం చేయాల్సి ఉంది. రాజ్యసభ సీటును ఖరారు చేస్తారని అనుకున్నా.. ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపున నామినేట్ కావడంతో అకామిడేట్ చేయలేకపోయారు. దీంతో సమీకరణాలు మారిపోయినట్లయింది.