UTF Chalo AP CMO: యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయుల ఛలో సీఎంవో ముట్టడితో విజయవాడ మొత్తం పోలీసు వలయంలో చిక్కుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) మండిపడ్డారు. ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. విజయవాడను పోలీసు వలయంలో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? అని అడిగారు. శాంతియుత నిరసనలకూ అనుమతించకపోవడం దుర్మార్గం అన్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముళ్లకంచెలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు (CPS Cancel) చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, మడమ తిప్పారని సెటైర్ వేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణం అని రామకృష్ణ అన్నారు.
ఎక్కడికక్కడ అరెస్టులు..
సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు, యూటీఎఫ్ సంఘాలు సీఎంవో ముట్టడి (UTF Chalo AP CMO)కి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు గుంటూరు-విజయవాడ మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. నిన్నటి నుంచే పలు జిల్లాల్లో ఉపాధ్యాయులను నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా నిఘా పటిష్టం చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. జంగారెడ్డిగూడెం డిపో నుంచి విజయవాడ వెళ్లే బస్సులు సైతం రద్దు చేశారు. ఉపాధ్యాయుల సెలవులను సైతం రద్దు చేస్తూ ఛలో సీఎంవోను అడ్డుకునే ప్రయత్నం జరిగిందంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు.
యూటీఎఫ్ నేతలు ఆగ్రహం..
తాము విజయవాడ వెళ్లకుండా చూసేందుకే బస్సులు రద్దు చేస్తున్నారని యూటీఎఫ్ నేతలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా తాము చేస్తున్న నిరసనను అడ్డుకునేందుకు విజయవాడ బస్సులు రద్దు చేయడంతో సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు ఎవరూ తాడేపల్లి వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారని, గుర్తింపు కార్డులు తనిఖీ చేసి తాడేపల్లి వైపు వెళ్తున్న 40 మంది ఉపాధ్యాయులు అరెస్టు చేశారని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సైతం మరికొందరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: AP Govt Teachers Holidays : ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు