కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ( Gajendra Singh Shekavat ) వచ్చే నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును ( Polavaram ) సందర్శించనున్నారు. ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి పోలవరం వస్తున్నారు. గతంలో నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) జలవనరుల బాధ్యతలు చూసినప్పుడు తరచూ సందర్శించేవారు. ఇప్పుడు షెకావత్ తొలిసారి ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. దాంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షించనున్నారు.
ఉగాదే ముహుర్తం - ఏపీలో కొత్త కేబినెట్ ఖాయం !?
కేంద్ర మంత్రి (Central Minister ) పర్యటనలో ఏపీ సీఎం జగన్ ( CM Jagan ) కూడా పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వీలయినంత త్వరగా తెచ్చి పూర్తి చేయాలని భావిస్తుంది. అయితే పోలవరంకు సంబంధించి అనేక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లను త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కానీ 2013-14 నాటి ధరలే చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ అంశం పీట ముడి పడిపోయింది.
బిల్లులు రావట్లేదు అయినా అవినీతికి పాల్పడ్డామా ? వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యే ఆగ్రహం !
పోలవరం నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నాయి. వీటిని ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అలాగే పునరావసం, నష్టపరిహారం విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఆ భారాన్ని ఎవరు భరిస్తారో క్లారిటీ లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. బిల్లులు రాకపోవడంతో పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేస్తామని చెప్పిన సమయం దాటిపోయింది.అయినా ముందుకు కదలడం లేదు. ఇప్పుడు షెకావత్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తుండటంతో మంత్రి సానుకూలంగా స్పందిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ( AP Governament ) భావిస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ గా కేంద్రం గుర్తించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒక్క ఏపీకే కాదని దేశం మొత్తానికి ఉపయోగమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే వీలైనంత ఎక్కువ సాయం చేసి ప్రాజెక్ట్ పూర్తయ్యేలా సహకరించాలని కోరుతోంది. పోలవరం ప్రాజెక్టుకు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి షెకావత్ పర్యటన తర్వాత తీరిపోతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.