కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ( Gajendra Singh Shekavat ) పోలవరం ( Polavaram ) పర్యటిస్తున్నారు.  ఇందుకూరు  - 1 , తాడ్వాయిల్లో  పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలను కేంద్ర మంత్రి షెకావత్ పరిశీలించారు. పునరావాస కాలనీలు అద్భుతంగా ఉన్నాయని మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు ( CM Jagan )  కృతజ్ఞతలని తెలిపారు.  పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఏపీకి వచ్చారు. ఆయనతో కలిసి సీఎం జగన్ కూడా పోలవరం పర్యటనకు వెళ్లారు. 


బీసీ హాస్టల్‎లో నిద్రిస్తుండగా పాముకాటు - చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి, ఒకరి పరిస్థితి విషమం


దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం ఇందుకూరు -1 కాలనీ ని ఏర్పాటు చేశారు. కాలనీలో ఇప్పటికే 306 నిర్వాసిత కుటుంబాలు చేరుకున్నాయి. ఆ కుటుంబాలతో  సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడారు.  పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ( Andhra Pradesh ) క జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని..  ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని కేంద్ర మంత్రి షెకావత్‌ హామీ ఇచ్చారు. 


చట్టం చేయకుండా నిలువరించడమా ? హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన !


పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులు ,షెకావత్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ముంపు గ్రామాల కన్నా ఎన్నో మెరుగైన వసతులతో ఇళ్లు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. నిర్వాసిత కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించి రివ్యూ ( Polavaram Review ) చేయనున్నారు.  పోలవర విషయంలో సీఎం జగన్  కేంద్రమంత్రి వద్ద ప్రత్యేకమైన హామీలు పొందాలనుకుంటున్నారు. ముఖ్యంగా సవరించిన అంచనాలను ఆమోదించేలా జగన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.


ఏపీ ప్రభుత్వం పోలవరాన్ని గత డిసెంబర్‌కే పూర్తి చేయాలని అనుకుంది. కానీ నిధుల సమస్య.. కరోనా ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ( Central Governament ) నిధులు రీఎంబర్స్ చేయకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వ  వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయితే శరవేగంగా పనులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.