Power Cuts Again In AP : ఆంధ్రప్రదేశ్‌లో ( Ap ) మళ్లీ అనధికారిక విద్యుత్ కోతలు ( Power Cuts ) పెరిగిపోయాయి. ఇటీవల తుపాను కారణంగా వాతావరణం చల్లబడటంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా ( Power Supply ) చేయగలిగారు. పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలీడేను దాదాపుగా నెలన్నర తర్వాత ఎత్తివేశారు. అయితే ఇటీవల ఏపీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గాలులు కూడా తోడయ్యాయి. దీంతో కరెంట్ వినియోగం పెరిగింది. పవర్ హాలీడే ( Power Holiday ) ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించడంతో పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ వినియోగించుకుంటున్నాయి. దీంతో  విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 


ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?


విద్యుత్ డిమాండ్‌ను సర్దుబాటు చేయడానికి అధికారులు తంటాలు పడుతున్నారు. పలు చోట్ల అనధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు.  విద్యుత్‌ కోతలతో ఏపీలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు ( Govt Hospitals ) గాఢాంధకారంలో మగ్గుతున్నాయి. సెల్‌ఫోన్‌ లైట్ల మధ్య రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతు న్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణపైనా విద్యుత్తు కోతల ప్రభావం కనిపిస్తోంది. ఉక్కపోత భరించలేక... దోమల బాధ తట్టుకోలేక ఇన్‌పేషెంట్లు అల్లాడిపోతున్నారు. రోగులు, వారి సహాయకుల చేతుల్లో విసనకర్రలు కనిపి స్తున్నాయి. అనకా పల్లి జిల్లా, వి.మాడుగుల గ్రామం లో సుమారు 6 గంటల పాటు కరెంట్ లేకపోవడం తో, స్థానిక ప్రభు త్వ ఆసుపత్రి లో రోగుల అవస్థలు పడ్డారు.  .విద్యుత్తు కోతలతో ఉక్కపోత భరించలేక రోగులు, వీరికి చికిత్స అందించలేక వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు.


బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !


ఉత్తరాంధ్ర, కోస్తాల్లో పలు జిల్లాల్లో అనధికారిక విద్యుత్ కోతలు అవుతోంది. లోడ్ రిలీఫ్ పేరిట ఎప్పుడు కావాలంటే అప్పుడు కోతలు విధిస్తున్నారు. ప్రజలకు సమాచారం కూడా లేకపోతూండటంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గితే.. పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందని..  వాతావరణ చల్లబడితే సమస్యేం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కొద్ది రోజుల కిందటి వరకూ ఏపీలోపెద్ద ఎత్తున పవర్ కట్స్ అమలయ్యాయి.  బహిరంంగ మార్కెట్‌లో కూడా కొనేందుకు అందుబాటులో లేకపోవడంతో  ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మరో సారి అదేపరి్సథితి కనిపిస్తోంది.