Two TDP leaders killed by rivals in Macherla : మాచర్లలో రాజకీయ ఫ్యాక్షనిజం మరోసారి పంజా విప్పింది.  బైక్‌పై వెళ్తోన్న ఇద్దరిని కారుతో ఢీకొట్టి గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. మృతులు గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. వీరిద్దరూ అన్నదమ్ములు.   గతంలో గతంలో ఇదే గ్రామానికి చెందిన తోట చంద్రయ్యను  వైసీపీ సానుభూతిపరులు ఊరి మధ్యలో పీక కోసి చంపారు.