Trains Cancelled Due To Dana Cyclone: వాయువ్య బంగాళాఖాతంలో 'దానా' (Dana Cyclone) తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశా పారదీప్‌కు 260 కిలోమీటర్లు ధమ్రాకు 290 కిలోమీటర్లు, బెంగాల్ సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమైంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూరీ - సాగర్ ద్వీపం మధ్య భితర్‌కనికా - ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంట ఈదురుగాలులు వీస్తున్నాయి. అటు, తుపాను ప్రభావంతో రైల్వే శాఖ గురు, శుక్రవారాల్లో పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ కే.సందీప్ రద్దైన రైళ్ల వివరాలు ప్రకటించారు. 


ఈ నెల 24న రద్దైన రైళ్ల వివరాలు


1. రైలు నెం. 03429 సికింద్రాబాద్- మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్


2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్


3. రైలు నెం.12703 హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్


4. రైలు నెం. 22603 ఖరగ్‌పూర్- విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్


5. రైలు నెం. 18045 షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 


6. రైలు నెం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్


7. రైలు నెం. 12841 షాలిమార్ - MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్


8. రైలు నెం. 12663 హౌరా- తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్


9. రైలు నెం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్


10. రైలు నెం. 18047 షాలిమార్- వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్


11. రైలు నెం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్


12. రైలు నెం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్


13. రైలు నెం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్


14. రైలు నెం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్


15. రైలు నెం. 08421 కటక్- గుణుపూర్ MEMU


16. రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్


17. రైలు నెం. 07471 పలాస- విశాఖపట్నం MEMU


18. రైలు నెం. 20837 భువనేశ్వర్- జునాగఢ్ ఎక్స్‌ప్రెస్


19. రైలు నెం. 18447 భువనేశ్వర్- జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్


20. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్


21. రైలు నెం. 20842 విశాఖపట్నం- భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్


22. రైలు నెం. 22874 విశాఖపట్నం- దిఘా ఎక్స్‌ప్రెస్


23. రైలు నెం. 18118 గుణుపూర్- రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్


24. రైలు నెం. 22820 విశాఖపట్నం- భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్


25. రైలు నెం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్


26. రైలు నెం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్


27. రైలు నెం. 22808 MGR చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్


28. రైలు నెం. 15227 SMVT బెంగళూరు- ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్


29. రైలు నెం. 20838 జునాగర్ రోడ్- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్


30. రైలు నెం. 18448 జగదల్పూర్- భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్


31. రైలు నెం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్


32. రైలు నెం. 12246 SMV బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్


33. రైలు నెం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్


34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్


35. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్


36. రైలు నెం. 07470 విశాఖపట్నం- పలాస మెము


37. రైలు నెం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్


ఈ నెల 25న రద్దైన రైళ్ల వివరాలు


1. రైలు నెం. 09060 బ్రహ్మపూర్- సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్


2. రైలు నెం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్


3. రైలు నెం. 22819 భువనేశ్వర్- విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్


4. రైలు నెం. 08531 బ్రహ్మపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్


5. రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్


6. రైలు నెం. 18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్


7. రైలు నెం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్


8. రైలు నెం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్


9. రైలు నెం. 18418 గన్‌పూర్- పూరి ఎక్స్‌ప్రెస్


10. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్


11. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్


Also Read: Andhra Pradesh BJP : ఏపీలో కిషన్ రెడ్డి పర్యటన - పార్టీ నేతలతో మంతనాలు - ఏపీ బీజేపీలో మార్పులుంటాయా ?