Top Headlines Today:


1. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు


తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని అభ్యర్థించారు. లేదంటే నిపుణులతో విచారణ చేయాలని కోరారు. తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఇంకా చదవండి.


2. వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 


అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడు మందికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించింది అనంతపురం జిల్లా న్యాయస్థానం. అంతే కాకుండా ఒక్కొక్కరికి 10వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. సోమవారం సంచలన తీర్పు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులోని ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఇంకా చదవండి.


3. రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్‌ జగన్


ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పర్సనల్ స్థాయికి వెళ్లిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారు ప్రతీ ఒక్కరూ. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేయడం కావాలనే ఆయన్ను జైల్లో పెట్టించడం వంటి పనులు చేశారని టిడిపి శ్రేణులు అంటుంటాయి. ఇప్పుడు ఆ వంతు టిడిపికి వచ్చింది. సీఎం చంద్రబాబు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇందులో నిజం ఎంతో కానీ జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సలపనివ్వకుండా ఒక ఇష్యుపై మరొకటి చేరుతోంది. ఇంకా చదవండి.


4. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్


తెలంగాణలో సంక్షేమ పథకాలు అన్నింటినీ అర్హులకు మాత్రమే అందజేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకురాబోతోంది. ఒక్క సంక్షేమ పథకాలే కాకుండా అన్ని ప్రభుత్వ చేపట్టే సంక్షమ కార్యక్రమాలన్నీ కూడా దానికే అనుసందానం చేయబోతోంది. టీపీసీసీ కొత్త చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించేందుకు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం ఆదివారం నాడు సమావేశమైంది. ఈ భేటీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ కార్డులు తీసుకొస్తామన్నారు రేవంతం రెడ్డి. ప్రజల కోసం చేపట్టే ప్రతి కార్యక్రమం ఆ డిజిటల్ కార్డుకు అనుసంధానిస్తామన్నారు. ఇంకా చదవండి.


5. యూపీఐ వినియోగంపై ప్రజలు ఏంటున్నారంటే.? సంచలన సర్వే ఏం చెబుతుందో తెలుసా.?


యూపీఐ (Unified Payments Interface) భారతదేశంలో వేగంగా విస్తరించింది, ప్రజల రోజువారీ జీవితంలో ఒక భాగమైంది. యూపీఐ వచ్చాక ప్రజలు బ్యాంక్‌లకు వెళ్లడం కూడా తగ్గించారు. గతంలో పెనుభూతంలా భారత్‌ను ఊపేసిన చిల్లర సమస్య ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలోని అనేక దేశాలు UPI తరహా విధానాన్ని అవలంబిస్తున్నాయి, అక్కడ కూడా మన UPIని యాక్సెప్ట్‌ చేస్తున్నాయి. మరోవైపు... మన దేశంలో ప్రతి నెలా UPI లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి, ఫిజికల్‌ కరెన్సీ వినియోగం వేగంగా తగ్గిపోయింది. తాజాగా, ఓ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సర్వే ప్రకారం, ఇంకా చదవండి.