నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్‌ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఉండనుంది. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్ కార్యక్రమాలకు హాజరు అవుతారు. కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
23.12.2022 షెడ్యూల్
ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.50 – 12.20 కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 12.35 – 12.45 పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకుంటారు. 1.15 – 1.25 మాధవి కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 – 3.45 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.50 ఇడుపులపాయ చేరుకుని వైయస్సార్ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి అక్కడే బస చేస్తారు.
24.12.2022 షెడ్యూల్
ఉదయం 9 గంటలకు వైయస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైయస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. 9.10 – 9.40 వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 10.00 – 12.00 ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొంటారు. 12.40 పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 1.10 – 1.20 విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 – 1.40 కదిరి రోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 1.50 – 2.00 కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. 2.05 – 2.20 మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 2.35 – 2.50 రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 3.00 – 3.30 డాక్టర్ వైయస్సార్ బస్‌స్టాండ్‌ను ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 3.35 – 3.55 అహోబిలపురం స్కూలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. 4.05 – 4.20 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 4.30 – 4.45 జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సాయంత్రం 5.40 గంటలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
25.12.2022 షెడ్యూల్
ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.15 – 10.15 సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొంటారు. 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
విజయనగరం జిల్లాలో నేడు చంద్రబాబు రెండో రోజు పర్యటన జరగనుంది. నేడు బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించనున్నారు. బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు ఓబీసీ లీడర్లతో సమావేశం అవుతారు.
నేడు మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు వర్ధంతి. ఉదయం 10 గంటలకు సర్క్యూట్ హౌస్ వద్ద గల పీవీ విగ్రహ ప్రాంగణంలో సంతాప కార్యక్రమాలు.
కోడిపందాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఆంక్షలు
పల్నాడు జిల్లాలో కోడి పందేలపై జిల్లా కలెక్టర్ శివ శంకర్ గురువారం ఆంక్షలు విధించారు. జిల్లాలో కోడిపందాలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం కోడిపందేలకు స్థలం ఇచ్చిన వారికి నోటీసులు సైతం జారీ చేశామన్నారు. ఈ ఆంక్షలకు అందరూ కట్టుబడి ఉండాలని కలెక్టర్ శివశంకర్ తెలియజేశారు.
రైల్వే విజయవాడలో డీఆర్ఎం ఆఫీస్ ముట్టడి జరగనుంది. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపాలని, ప్రతినెల సక్రమంగా జీతాలు చెల్లించాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రైల్వే ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ మరియు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంఛార్జి బాచిన కృష్ణ చైతన్య పర్యటన వివరాలు
ఉదయం:10:00 గంటలకు కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామం, St కాలనీలో గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా సీసీ డ్రైన్స్ కు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామం, ZP హై స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బైజూస్ కంటెంట్ తో ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11.30 గంటలకి కొరిశపాడు మండలం, తిమ్మనపాలెం గ్రామంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.00 గంటలకి అద్దంకి పట్టణంలో హ్యాండ్ వాష్ స్టేషన్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమాలలో ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లు, మున్సిపల్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, వార్డు ఇంఛార్జిలు వివిధ హోదాలలో, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్న నాయకులు పాల్గొంటారు.