2023 Unlucky Zodiac Signs:  పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నప్పుడు ఎన్నో ఆశలుంటాయి. గడిచిన ఏడాదిలో మంచి జరిగితే అదే మంచి కొత్త ఏడాదిలో కూడా కంటిన్యూ అవ్వాలని...చెడు జరిగితే ఆ చెడుకి పాత ఏడాదితో ఫుల్ స్టాప్ పడి న్యూ ఇయర్లో అంతా మంచే జరగాలని కోరుకుంటారంతా. అయితే ఎవరికి వారు మంచి జరగాలని కోరుకోవడం సహజం...అయితే..అందుకు గ్రహస్థితి కూడా అనుకూలించాలి అంటారు పండితులు. గ్రహాలు నెలకోసారి రాశి మారుతుంటాయి. ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అయితే కొన్ని గ్రహాల ప్రభావం ఏడాదంతా వెంటాడుతాయి. అలా 2023లో కొన్ని రాశులవారికి అంతగా బాలేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే 2023లో ఈ రాశులవారు అదృష్టానికి దూరంగా దురదృష్టానికి దగ్గరగా ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు


మేష రాశి
మేష రాశివారికి 2023 అంతగా అనుకూల ఫలితాలనివ్వదు. అలాగని పూర్తిగా ప్రతికూల ఫలితాలనే ఇస్తుందనే భయం అవసరం లేదు కానీ 2022తో పోలిస్తే ఈ ఏడాది కొన్ని సమస్యలు ఎదుర్కోకతప్పదు. పనిపట్ల ఉండే అజాగ్రత్త వీళ్లకి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులకు సమస్యలు తప్పవు, వ్యాపారులు నూతన పెట్టుబడులు కొత్త ప్రణాళికల గురించి ఆలోచించకపోవడమే మంచిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అవివాహితులకు ఈ ఏడాది కూడా వివాహం జరగదు. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితిని బట్టి ఫలితాలు కొంత మారొచ్చు కూడా...


Also Read:  2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు


మకరరాశి
మకరరాశి వారికి కూడా 2023 అంతగా కలసిరాదు. ఈ రాశివారు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాదాల్లో చిక్కకుంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశులవారి గురించి వారి వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతారు. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు పొందలేరు. నిజమైన ప్రేమను చూపించినా అది ఎవ్వరికీ అర్థంకాదు. అవివాహితులు ఎలాగోలా పెళ్లైతే చాలు అనే ఆలోచనకు వచ్చేస్తారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లడమే కానీ గ్రహబలం మీకు అంతగా కలసిరాదు..


Also Read: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం


కుంభ రాశి
2023లో దురదృష్టవంతుల జాబితాలో కుంభరాశి వారుకూడా ఉన్నారు. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. ఖర్చులు తగ్గించకపోతే ఈ పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఏదీ ప్లాన్ చేసుకోలేరు..ఏం చేయాలి అనుకున్నా కొన్ని అడ్డంకులు తప్పవు. ఒంటరిగా ఉండలేరు..కుటుంబంతో సంతోషంగా ఉండలేరు అనే పరిస్థితిలో ఉంటారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి...దీంతో సమస్యలు మరింత పెరుగుతాయి.