Top 5 Reasons for YS Jagan Loss | వైసీపీ అధినేతగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151సీట్లు గెలుచుకుని అఖండమైన మెజార్టీని అందుకున్న జగన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అసలు ఈ స్థాయిలో జగన్ దారుణమైన పతనాన్ని చవిచూడటానికి టాప్ 5 కారణాలు ఇలా ఉన్నాయి.


1.  ఏపీ రాజధాని ఏది.?
 కొన్ని విషయాలు ఉంటాయి ఏదైనా కవర్ చేసుకోవచ్చు. కొన్ని విషయాలు ఎమోషనల్ డ్యామేజ్. ఈ ఐదేళ్లలో ఏపీ ప్రజలు ఎమోషనల్ డ్యామేజ్ అయ్యేలా చేశారు జగన్. కనీసం మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. అమరావతిని కాదని మరో రెండు చోట్ల రాజధానులు పెడతామన్నారు సరే దాన్నైనా ముందుకు తీసుకెళ్లారా అంటే అదీ లేదు. లీగల్ ప్రాబ్లమ్స్ పట్టించుకోలేదు. అన్నింటికంటే ఇగోనే ఎక్కువనుకున్న జగన్ చేసిన ఆలోచనలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.


2. తాడేపల్లి ప్యాలెస్
 ప్రజాస్వామ్యంలో ప్రజలకు నేతలు ఎంత దగ్గరగా ఉంటే పాలకుల్ని ఓటర్లు అంత ఇష్టపడుతుంటారు. కానీ జగన్ దానికి రివర్స్ చేశారు. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని తాడేపల్లి ప్యాలెస్ అని ఆయనకు అదో రాజకోట అన్నట్లుగా మార్చుకుని..అందులో నుంచి బయటకు రాకుండా పాలన కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయటమే కాదు..చాలా సార్లు నిజం అనిపించేలా జగన్ వ్యవహరించారు. బయటకు వస్తే చాలు ప్రజలకు తను కనపడకుండా పరదాలు అడ్డు పెట్టడం....బహిరంగ సభల్లో తప్ప మరెక్కడా నేరుగా ప్రజలను కలిసే మార్గం లేకుండా చేయటం లాంటి జగన్ కు చాలా వ్యతిరేకం అయ్యాయి. 


3. నేను మోనార్క్ ని
  నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అన్నట్లు తన నీడను కూడా నమ్మకుండా జగన్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టింది. ఓ ఎమ్మెల్యేకో, ఓ ఎంపీకో జగన్ ను నేరుగా కలిసే యాక్సెస్ ఉండదు. జగన్ తో మాట్లాడాలంటే ముందున్న కోటరీని దాటి వెళ్లాలి. గెలుస్తాడు అనుకుంటే ఒకలా...తన సర్వేల్లో తేడా వస్తే మరోలా జగన్ నాయకులపై వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసిన నాయకులు చాలా మందే ఉన్నారు ఈ సారి వైసీపీలో. అటు ప్రజలతోనూ కలవక ఇటు నాయకులనూ మెప్పించక మోసార్క్ లా జగన్ వ్యవహరించిన తీరు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి.



4. మీడియాకు దూరం
  దుష్ట చుతష్టయం ఇది చాలా సార్లు జగన్ నోటి నుంచి ఈ ఐదేళ్లలో విన్నమాట. ఓ నలుగురు వ్యక్తులనో లేదా నాలుగు ఛానళ్లలోనో విమర్శించటం కాదు..మొత్తం మీడియానే దూరం పెట్టారు వైఎస్ జగన్. ఈ ఐదేళ్లలో ఆయన ప్రెస్ మీట్స్ ఇచ్చిన సందర్భాలు కేవలం రెండో మూడో. కరోనా టైమ్ లో జగన్ పెట్టిన ప్రెస్ మీట్లు..ఆ విజ్ఞాన ప్రదర్శన ఆయన్ను అభాసు పాలు చేయటంతో పాటు మరోసారి మీడియా ముందుకు రాకుండా చేశాయి. బహిరంగ సభల్లో జగన్ మాట్లిడితే ప్రజలకు ఆయన ఆలోచనలు ఏంటో తెలియటం తప్ప...మరో మార్గం లేకుండా తనను తనే ఓ క్లోజ్డ్ సర్క్యూట్ లో పెట్టుకున్నారు. ఇక ఆయన బహిరంగ సభలు ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసేందుకు తప్ప మరో దానికి కాదని ప్రజలు అర్థం చేసుకోవటం కూడా జగన్ నుంచి ఓటర్లు దూరమయ్యేలా చేశాయి.


5. ప్రగతిని వదిలేసి డబ్బులిస్తే చాలని :
 తన ఐదేళ్ల పాలనలో జగన్ నోటి తో మాట్లాడటం కంటే డబ్బుతో మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. సామాన్యులను సంక్షేమ పథకాలతో శ్రీమంతులను చేస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు..అప్పులు తెచ్చి పంచిన డబ్బులు అరకొరా బతుకుల్ని మార్చేయామే కానీ డబ్బుతో ఓట్లు రాబట్టాలనే ఆయన ఆశలను నీరుగార్చాయి. మరో వైపు ప్రగతిని పూర్తిగా వదిలేశారు. గతుకుల్లో రోడ్లు వెతుక్కోవాలి తప్ప కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రంలా ఏపీని మార్చేయటం..యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లటం.. ఉద్యోగాలు ఇవ్వమంటే వాలంటీర్లు ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు చేసిన హడావిడి ఇవన్నీ జగన్ ఓటమికి కారణాలుగా మారాయి. లాస్ట్ టైమ్ ఎన్నికల్లో ఎంత మేండేట్ తమకు ఇచ్చారు ప్రజలని వైసీపీ సంబరపడిందో ఇప్పుడు అంతకు మించిన ప్రజా తీర్పును కూటమికి అప్పగించి డబ్బులు పంచితే చాలు ప్రజలు గొర్రెల్లా ఓటేస్తారనే ఆలోచనలకు చెక్ పెట్టినట్లయింది.