AP Tomoto War  :    ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఊహించని రాజకీయం ఉంటుంది. తాజాగా దేశమంతా టమోటా ధరలపై రచ్చ జరుగుతోంది. దీన్ని ఏపీ రాజకీయ పార్టీలు కూడా వేగంగా అందుకున్నాయి. టమోటా ధర రూ. వంద దాటిపోయిందని..ఏపీ ప్రభుత్వం వెంటనే రైతు బజార్లలో రూ. యాభైకు అమ్మకాలు ప్రారంభించింది. తెలుగు పార్టీ ఇంకా ముందుకు వెళ్లింది. కేజీ రూ. 30కే అమ్మకాలు చేపట్టింది.  పలు చోట్ల ఇలా పోటాపోటీ అమ్మకాలు జరపడంతో ఏపీ రాజకీయాల్లో టమోటావార్ ప్రారంభమయినట్లయింది. ల


దేశంలో 60 శాతం టామోటా  అవసరాలను ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర తీరుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, ఆదిలాబాద్‌ జిల్లాలు టమోటా సాగుకు పెట్టింది పేరు. మదనపల్లె టమోటా మార్కెట్‌ దక్షిణ భారత్‌లో అతిపెద్దది.  దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలలో వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. రుతుపవనాలకు కొంచెం ముందు అకాల వర్షాలు, తెగుళ్లు పంట ఉత్పత్తిని దెబ్బ తీశాయి. అప్పటివరకు కిలో టమోటాల ధర పది నుంచి 20 రూపాయలుండేది. ఇది మార్కెట్‌ ధర. రైతుకు కిలో ఐదారు రూపాయలు కూడా గిట్టేది కాదు. సాగు ఖర్చు కూడా దక్కలేదన్న బాధతో వారు రోడ్డుపక్కన, చేలల్లో ను పంటను పారబోసిన సందర్భాలు ఈ సీజన్‌లో కన్పించాయి. అకాలవర్షాల నేపథ్యంలో వాటి ధరలు పెరగడం మొదలైంది. సాధారణంగా    జనవరిలో అత్యధి కంగా టమోటా సాగు ఉంటుంది. జులై-ఆగస్టు, నవంబ ర్‌ – డిసెంబర్‌లలో కొద్ది విస్తీర్ణంలోనే టమోటా సాగవు తుంది. అందువల్ల వాటికి డిమాండ్‌ పెరిగింది.                                                            


టమోటా ఎక్కువగా పండే రాష్ట్రాల నుంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు రవాణా సౌకర్యం, నిల్వ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరి, మొక్కజొన్న సహా ఇతర పంటలకు ఇచ్చిన రీతిలో టమోటాలకు మద్దతు ధర లేదు. అందువల్ల దేశవ్యాప్తం గా వీటి ధర ఒకే రకంగా లేదా నిలకడగా ఉండదు. అందుకే  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సబ్సిడీపై కిలో రూ. 50 కే రైతుబజార్లలో అందిస్తోంది. అయితే ఇలా కూడా ప్రజల్ని దోచుకుంటన్నారని చెప్పడానికి టీడీపీ రూ. 30కే అమ్మడం ప్రారంభిచింది. 


తెలుగుదేశం పార్టీ నేతలు యాక్టివ్ గా ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టమోటాలను సెంటర్లలో రూ. ముఫ్పైకే కేజీ ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కడ అయితే రైతు బజార్లలో యాభై కు అమ్ముతుందో.. అక్కడికి దగ్గర్లోనే తాము ముఫ్ఫైకి అమ్ముతున్నారు. దీంతో ప్రజలు రెండూ చోట్ల ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఇప్పుడు టమాటా రాజకీయం హైలెట్ అవుతోంది.