Kapu Ramachandra Reddy: వైసీపీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి బీజేపీలోకి? ఆ భేటీ అందుకేనా?

Kapu Ramachandra Reddy: బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కాపు దంపతులు కలిశారు.

Continues below advertisement

MLA Kapu Ramachandra Reddy may join in AP BJP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో సుదీర్ఘ అనుభవం అనుబంధం ఉన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వెళుతున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరిని.. కాపు తన కుటుంబ సమేతంగా కలిశారు. 

Continues below advertisement

బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ ను కాపు దంపతులు కలిశారు. నియోజకవర్గంలో తన సన్నిహితులు శ్రేయోభిలాషులు అభిప్రాయాలను తెలుసుకొని మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 18 మంది ఎమ్మెల్యేలు కాపు రామచంద్ర రెడ్డి ఒకరు. అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనాడు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వారిలో ఒకరు కాపు రామచంద్రారెడ్డి మరొకరు అప్పటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న గురునాథ్ రెడ్డి. కాపు రామచంద్రారెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో విధేయతగా పనిచేశారు.

మొదటి నుంచి చివరి వరకూ యాత్రలో
జగన్ పాదయాత్రలో రామచంద్ర రెడ్డి భార్య కాపు భారతి ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్నారు. వైయస్ జగన్ తనకు ఆరాధ్య దైవం అని గతంలో కూడా కాపు రామచంద్ర రెడ్డి ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గం బీసీ జాబితాలో ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన దాదాపుగా 9 లక్షల మంది కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, గుంతకల్లు నియోజకవర్గం వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. తాను ఏ తప్పు చేశాను తెలియదు కానీ తనకంటే ఎక్కువ తప్పులు చేసిన వారికి అందలం ఎక్కించి కూర్చోబెట్టాలని ఆవేద వ్యక్తం చేశారు. చాలా నియోజకవర్గాల్లో పూర్తిగా ఫెయిల్ అయిన వారిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేసి ఓదార్చే న జగన్మోహన్ రెడ్డి తన విషయంలో ఎందుకు ఇంత  కటినంగా వ్యవహరించారో అర్థం కాలేదని తన బాధను వ్యక్తం చేశారు. 

గతంలో రఘువీరా రెడ్డితోనూ
గతంలో తాడేపల్లికి సెల్యూట్ చేసి వచ్చిన కాపు రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డిని వారి సొంత గ్రామం నీలకంఠాపురంలో కలిసి వచ్చారు. ఈ కలయికతో కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు చక్కర్లు కొట్టాయి.. ఇంతలోనే బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి ఆదినారాయణ కాపు రామచంద్రారెడ్డి దంపతులు కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నారా అని ఆసక్తి నెలకొంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతలను కాపు రామచంద్రారెడ్డి కలవడంపై నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. 

రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కమలం గూటికి కాపు రామచంద్రారెడ్డి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గంనీ దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరుతున్నారని సమాచారం అందుతుంది. కర్ణాటక బీజేపీలో లింగాయత్ సామాజిక వర్గం కీలకంగా వ్యవహరిస్తోంది. అందుదకు అనుగుణంగానే బీజేపీ పార్టీలోకి వెళ్తేనే తనకు సరైన అవకాశాలు లభిస్తాయని కాపు రామచంద్రారెడ్డి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి బీజేపీ కూటమి ఏర్పడితే కూటమిలో బీజేపీ తరఫున రాయదుర్గం సీటు పొందవచ్చని కాపు ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement
Sponsored Links by Taboola