AP EDCET 2024 Web Counselling: ఏపీఎడ్‌సెట్‌(బీఈడీ)-2023 తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 9 వరకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.


రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు మార్చి 2 నుంచి 5 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. వీరికి మార్చి 6న వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత మార్చి 9న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు మార్చి 11లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మార్చి 16 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలల్లో మొత్తం  34 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.


కౌన్సెలింగ్ షెడ్యూలు..


🔰 కౌన్సెలింగ్ నోటిఫికేషన్: 26.02.2024.


🔰 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ (పేపర్ ప్రకటన): 27.02.2024.


🔰 వెబ్‌కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: 28.02.2024 - 02.03.2024.


🔰 సర్టిఫికేట్ వెరిఫికేషన్: 29.02.2024 - 03.03.2024.


🔰 వెబ్‌ఆప్షన్ల నమోదు: 02.03.2024 - 05.03.2024.


🔰 వెబ్‌ఆప్షన్ల మార్పులు: 06.03.2024.


🔰 రెండోవిడత సీట్ల కేటాయింపు: 09.03.2024.


🔰 సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 11.03.2024.


🔰 తరగతులు ప్రారంభం: 16.03.2024.


Phase-2 Counselling Notification


Counselling Website


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌‌కు అవసరమయ్యే సర్టిఫికేట్లు..


1) ఏపీ ఎడ్‌సెట్-2023 హాల్‌టికెట్


2) ఏపీ ఎడ్‌సెట్-2023 ర్యాంకు కార్డు 


3) ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)


4) డిగ్రీ మార్కుల మెమో/కన్సాలిడేటెట్ మార్కుల మెమో


5) డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికేట్ 


6) ఇంటర్ మార్కుల మెమో/ డిప్లొమా మార్కుల మెమో


7) పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత మార్కుల మెమో


8) 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు 


9) రెసిడెన్స్ సర్టిఫికేట్ 


11) ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు 


12) SC/ST/BC అభ్యర్థులైతే క్యాస్ట్ సర్టిఫికేట్


13) EWS సర్టిఫికేట్ 


14) లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ 


15) పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ & గేమ్స్/ స్కౌట్స్ & గైడ్స్ సర్టిఫికేట్


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షను జూన్ 14న ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 77 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.  పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,235 (82.17 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జులై 14న విడుదల చేయగా.. ఫలితాల్లో మొత్తం 10,908 (97.08 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.


మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


🔰 రిజిస్ట్రేషన్: 31.01.2024 - 06.02.2024.


🔰 సర్టిఫికేట్ వెరిఫికేషన్: 02.02.2024 - 07.02.2024.


🔰 సర్టిఫికేట్ వెరిఫికేషన్ (పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ & గేమ్స్/ స్కౌట్స్ & గైడ్స్/ఆంగ్లో ఇండియన్స్): 05.02.2024.


🔰 వెబ్‌ఆప్షన్ల నమోదు: 09.02.2024 - 13.02.2024.


🔰 వెబ్‌ఆప్షన్ల మార్పులు: 14.02.2024.


🔰 మొదటి విడత సీట్ల కేటాయింపు: 17.02.2024.


🔰 సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 19.02.2024.


🔰 తరగతులు ప్రారంభం: 19.02.2024.


:మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...