TTD Meeting: తిరుమల క్షేత్రం అలిపిరి నడక మార్గంలో మరోసారి భక్తులకు చిరుత కనిపించింది. ఆదివారం సాయంత్రం నడక‌మార్గంలోని 2,450 మెట్టు వద్ద చిరుత పులి నడకదారి భక్తులకు కనిపించడంతో టిటిడి విజిలెన్స్, అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వేంటనే ఘటన స్ధలానికి చేరుకున్న అటవీ శాఖా అధికారులు చిరుత కనిపించిన ప్రాంతంలో శబ్ధాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే అలిపిరి నడక మార్గంలో ఆరెళ్ళ బాలిక లక్షితపై దాడి చేసి‌ చంపేయడంతో అప్రమత్తంమైన టిటిడి 7వ మైలు నుంచి శ్రీ నృశింహ స్వామి ఆలయం వరకూ 100 మంది భక్తులను ఒకేసారి జన సమూహంగా పంపుతున్నారు. 


తాళ్ల సహాయంతో భక్త బృందంకు ముందు వైపు, వెనుక వైపు మరికొందరు భధ్రతా సిబ్బంది నడుమ సురక్షితంగా పంపుతున్నారు. మరొ వైపు అలిపిరి నడక మార్గంలో చిన్నారులు తప్పి పోకుండా ట్యాక్స్ వేయడంతో పాటుగా, చంటి పిల్లల తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ, ఆదివారం మధ్యాహ్నం ను‌ండి 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం 2 గ‌ంటల నుండి అలిపిరి నడక మార్గంలో అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తుల భధ్రతగా అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకోవచ్చని టిటిడి భావిస్తుంది. ఇక చిరుత సంచరిస్తున్న కారణంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల‌ నుండి ఉదయం 6 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను అనుమతిని టిటిడి రద్దు చేసింది. 


బాలికపై దాడి చేసిన తర్వాత చిరుత ఎన్ని‌సార్లు కనిపించిందంటే.???
గత రెండు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసిన తర్వాత టిటిడి భక్తుల భద్రత దృష్ట్యా అలిపిరి నడకమాత్రం మార్గంలో ఆంక్షలు విధించింది అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం అదుపులోకి వచ్చేంతవరకు టీటీడీ అమల్లోకి తెచ్చిన ఆంక్షలు అమలు చేయనుంది అయితే శనివారం‌ ఒక్క‌ రోజే‌ అలిపిరి‌ నడక మార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం‌ జరిగింది. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రెండోవ ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత వాహనదారులను తారాస పడింది. వాహనదారులు సమాచారం మేరకూ ఘటన స్ధలం వద్దకు చేరుకున్న అటవీ శాఖా అధికారులు ఆ ప్రాంతంను జల్లెడ పట్టారు.. అదే విధంగా ఆదివారం సాయంత్రం 2450వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు‌ వేంటనే సమీపంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. దీంతో ఘటన స్థలంకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులి మళ్లీ నడక మార్గంలోకి రాకుండా భారీ శబ్దాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేస్తున్నారు..


సోమవారం టిటిడి ఛైర్మన్ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ సమావేశం..
ఘాట్ రోడ్డు, నడక మార్గంలో చిరుత సంచారంతో సోమవారం ఉదయం టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హై లేవల్ కమిటి సమావేశం కానుంది.. ఈ సమావేశంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి, టిటిడి అటవీ శాఖా అధికారులు,జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి,ఎస్పి పరమేశ్వర రెడ్డి, టిటిడి సివి అండ్ ఎస్వోతో పాటుగా మరికొంత మంది అధికారులు పాల్గొననున్నారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా నడకదారి భక్తుల భధ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.. దర్శన టోకెన్ కోసం నడకదారిన విచ్చేసే భక్తుల ఇక్కట్లు తోలగించాలని టిటిడి భానిస్తుంది.. నడకదారి భక్తులకు జారి చేసే దర్శన టోకేన్ల విధానాని రద్దు చేసి, సర్వదర్శన టోకేన్లు పెంచే యోచనలో టిటిడి ఉన్నట్లు తెలుస్తుంది.. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం జారి చేస్తున్న 15 వేల టోకేన్ల సంఖ్యను 30 వేలకు పెంచే విధంగా టిటిడి భావిస్తుంది.. దీనితో భక్తులు దర్శన టోకేన్ కోసం నడకదారి ప్రయాణం చేయరని, మెక్కులు ఉన్న వారే నడకమార్గంలో వస్తారని టిటిడి భావిస్తుంది. అంతే కాకుండా మరికొన్ని కీలన నిర్ణయాలను సమావేశం అనంతరం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది..