TTD On Sri Vani Trust :  శ్రీవాణి ట్రస్టు విరాళాలు దుర్వినియోగం కాలేదని, హిందూ దేవాలయాల నిర్మించేందుకు నిధులను వినియోగిస్తున్నట్లు టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.. గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి టిటిడి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.  తిరుమలో విశ్వహిందూ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన విషయాలను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు..  ఇప్పటి వరకు 6 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శించుకోగా.. 8 లక్షల 24 వేల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందించినట్లు తెలిపారు. 


రూ.  860 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ విరాళం అందాయని, పది వేల విరాళం ఇచ్చి, రూ.  500 టికెట్ కోసం చెల్లిస్తారని తెలిపారు. రూ. 500 టికెట్ ఉంటే మూడు వందలకు రశీదు ఇస్తే భక్తులు ఎవ్వరు ఊరుకోరని, ఇలాంటి ఆరోపణలు చేస్తే భగవంతునిపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.. టిటిడి పై ఏదైనా సమాచారం కావాలంటే అధికారులు అందుబాటులో ఉంటారని ఏదైనా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.. 214 మంది దళారీలను అరెస్టు చేశామని, ట్రస్ట్ ద్వారా దళారీ వ్యవస్థ పూర్తిగా తగ్గిందన్నారు.. గత ప్రభుత్వం హయాంలో 2018 లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించారని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి అన్నారు. కానీ అప్పట్లో దళారులు ఉండటం వల్ల విరాళాలు రాలేదని.. ఇప్పుడు దళారుల్ని తగ్గించడం వల్ల విరాళాలు వచ్చాయని ధర్మారెడ్డి చెప్పారు. 


శ్రీవాణి ట్రస్ట్ పై టిటిడి ఈవో నుండి పూర్తి సమాచారం సేకరించాంమని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రాఘవులు అన్నారు.   టిటిడి టార్గెట్ చేస్తు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, తాను కూడా నిజమే అనుకున్నానని దీపక్ రెడ్డి అనే మరో విహెచ్‌పీ సభ్యుడు ్న్నారు.  రూ. 800 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిందని టిటిడి సమాచారం అందించిందన్నారు.. శ్రీవాణిపై వచ్చిన విరాళాలు ఆలయ నిర్మాణానికి ఎలా వాడుతున్నారు, ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలు నిర్మించారు అన్ని సమాచారం టిటిడి ఇచ్చిందన్నారు.. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు వద్దు, పూర్తి సమాచారం తీసుకుని మాట్లాడాలని రాజకీయ నేతలకు హితవు పలికారు.  శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చాలా మంచి పరిణామాలు జరిగాయని, స్వామి వారిని దర్శించుకోవాలి అనుకునే వారు సిఫార్సు లేకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది దర్శనం చేసుకొంటున్నారని లలిత పీఠాధిపతి అన్నారు. 


వాణి ట్రస్ట్ విరాళం 10 వేలు ఎక్కడికో వెళ్తుంది, రూ. 500 టిటిడి వస్తుందని అపోహలు ఉన్నాయని..శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన డబ్బులు ఎక్కడికి పోలేదని, టిటిడికే చేరుతుందని  బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి చెప్పారు. వచ్చే డబ్బులన్ని ఆలయాల నిర్మాణానికే వాడుతున్నారన్నారు.. రాజకీయంగా మాట్లాడేవారు పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలన్నారు. 
హనుమధ్ ఫీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీ కూడా మీడియాతో మాట్లాడారు.  ఎన్నో సంవత్సరాల నుండి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, రాజకీయ నాయకుల ఉన్నది లేనిది అన్ని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ ఆరోపణలు చెప్పే వారికి ఇక్కడ జరుగుతున్న వాటికి పొలిక లేదని, టిటిడి వద్ద పూర్తి సమాచారం సేకరించాంమన్నారు.


మారుమూల ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణాలను టిటిడి చేస్తుందని, తెలిసి తెలియక టిటిడిపై చేసే ఆరోపణలు భక్తులు నమ్మవద్దని, తిరుమలలో దళారి వ్యవస్థ కూడా నేడు తగ్గుముఖం పట్టిందని, రాజకీయ నాయకులు టిటిడి పై అసత్య ప్రచారాలు చేయవద్దని, స్వామీజీలు అందరం టిటిడిపై వచ్చే ఆరోపణలను వ్యతిరేకిస్తాంమని ఆయన తెలిపారు..