Karnataka MLAs Rajya Harathi Proposal: భగవంతుడి సన్నిధిలో అందరూ సమానులే అనే వేదాంత సూత్రం.. నేటి ఆధునిక రాజకీయ, వీఐపీ సంస్కృతి ముందు వెలవెలబోతోంది. తాజాగా కర్ణాటక  ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణ, వీఐపీ ప్రొటోకాల్‌పై సరికొత్త జాతీయ చర్చకు తెరలేపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత విశిష్టమైన అతిథులకు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి మాత్రమే ఇచ్చే  తొలిహారతిని.. ఇకపై కర్ణాటకకు వచ్చే ప్రముఖులకు, వీఐపీలకు కూడా విస్తరిస్తామంటూ ఆయన ప్రకటించారు. కర్ణాటక ఎమ్మెల్యేలు తిరుపతికి వెళ్తే దర్శనం కాకుండానే తిరిగి వస్తున్నారని, ఈ కొత్త ప్రతిపాదనతో వారు దేవుడి ముందు నిలబడి హారతి తీసుకునే అవకాశం దక్కుతుందని డీకే శివకుమార్ సమర్థించుకోవడంపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  

Continues below advertisement

తొలి హారతిపై డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు  

వాస్తవానికి తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. దాని నియమ నిబంధనలు, ప్రొటోకాల్స్, పూజా విధానాలను నిర్ణయించే పూర్తి అధికారం టీటీడీ బోర్డుకు,  ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. పక్క రాష్ట్రానికి చెందిన డీకే శివకుమార్ తిరుమల అంతర్గత ఆచారాలపై గానీ, ప్రొటోకాల్ హారతులపై గానీ ఇలాంటి  ఏకపక్ష ప్రకటనలు చేయడానికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదు. అయినప్పటికీ, కర్ణాటకలో  భక్తులను, సొంత పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆయన ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కర్ణాటక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు తిరుమలలో  మొదటి హారతి  దర్శన సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. దాన్ని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు ఏకంగా  నిత్య హారతి ని తమ రాష్ట్ర అధికారిక అతిథి మర్యాదల్లో భాగం చేస్తామనడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు.

Continues below advertisement

భానుప్రకాష్ రెడ్డి విమర్శలు    డీకే శివకుమార్ చేసిన ఈ తాజా ప్రకటన అమలు కావాలంటే టీటీడీ బోర్డు ఆమోదం తప్పనిసరి.  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రతిపాదనపై తిరుమల తిరుపతి దేవస్థానం  బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేల కోసం  నిత్యహారతి  దర్శనాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్‌ను ఆయన పూర్తిగా ఖండించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ప్రత్యేక గౌరవం కేవలం మైసూర్ మహారాజు వంశస్థులకు మాత్రమే దక్కే సాంప్రదాయ హక్కు అని, దీన్ని రాజకీయ అవసరాల కోసం లేదా ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్ కోసం వాడుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్ర నియమాలను, ఆచారాలను రాజకీయ లబ్ధి కోసం మార్చాలని చూడటం సరికాదని ఆయన హితవు పలికారు.

కొత్త వివాదం

తిరుమల ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, ఇక్కడి ఆలయ వ్యవహారాలు, పూజా విధానాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం టీటీడీ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని భానుప్రకాశ్ రెడ్డి గుర్తుచేశారు. పక్క రాష్ట్రానికి చెందిన నాయకులు తమ రాజకీయ మైలేజ్ కోసం తిరుపతి సంప్రదాయాలను వాడుకుంటూ ఇలాంటి ఏకపక్ష ప్రకటనలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీఐపీల కోసం తగిన దర్శన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం అత్యంత విశిష్టమైన హారతి ఆచారాన్ని కేటాయించాలనడం సామాన్య భక్తుల హక్కులను కాలరాయడమే అవుతుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు తన నిబంధనలకు కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.