Tirumala News: జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి తిరుమల సహా అనుబంధ ఆలయాల్లో జరగనున్న వివిధ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు ఇతర కార్యక్రమాల జాబితాను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.


టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.


– జూలై 4 నుండి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు


– జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు


– జూలై 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం


• ⁠జూలై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు


– జూలై 18 నుండి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు


జూలై 18 నుండి 22వ తేదీ వరకు
– శ్రీ విఖనశాచార్య ఉత్సవాలు


– జూలై 21న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ


– జూలై 26న శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో వార్షిక పుష్పయాగం


• జూలై 29న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభం


• ⁠జూలై 30న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణం, ఆడి కృతిక


• ⁠జూలై 31న సర్వ ఏకాదశి


తిరుమల దర్శన వివరాలు


ఇక తిరుమలకు వచ్చిన వారిలో జూన్ 30న 81,005 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దాదాపు 28,244 మంది తలనీలాలు సమర్పించారు. 3.94 కోట్ల ఆదాయం హుండీల ద్వారా సమకూరింది. నాలుగు వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది.