Tirumala No Plastic Zone : తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. అంతే పవిత్రంగా నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ప్లాస్టిక్ కాలుష్యం కూడా లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్ రహిత తిరుమలకు అడుగులు ప్రారంభించారు. భక్తులు ప్లాస్టిక్ వస్తువుల్ని కొండపైకి తీసుకు రావడాన్ని నిషేధించారు.  టీటీడీ దశల వారిగా ప్లాస్టిక్ వాడకంను తిరుమలలో నిషేధించాలని నిర్ణయం తీసుకుంది.. మొదటి దశలో భాగంగా ముందుగా శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో ఉపయోగించే ప్లాస్టిక్ కవర్ల ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  తరువాత రెండో దశలో‌ భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.  హోటల్స్, స్ధానిక నివాసితులు, మఠాలల్లో ప్లాస్టిక్ వాటర్ బాటల్స్ ను ఉపయోగించరాదని హెచ్చరించింది.   లాస్టిక్ వాటర్ బాటల్స్ ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది టిటిడి. దీంతో తిరుమలలో చాలా వరకూ ప్లాస్టిక్ వాడకం తగ్గింది. 


తిరుమలలో ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం !


ఇక మూడో  దశలో స్ధానికులు, హోటల్స్, దుకాణాదారులతో ముందుగా సమావేశంమైన టిటిడి అధికారులు ఇకపై సంపూర్ణంగా తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.. ఎవరైనా దుకాణదారులు, మఠాల నిర్వహుకులు, హోటల్స్ నిర్వహుకులు  ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే లైసెన్స్ రద్దు చేసి, చట్టరిత్యా చర్యలు తీసుకుంటాంమని‌ హెచ్చరించింది.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ ఒకటో తేదీ నుంచి  సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న క్రమంలో తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దే విధంగా అధికారులు నడుం బిగించారు.. నేటి నుండి తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్ళే స్థానికులు, వ్యాపారులు, భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.


షాంపూ కవర్లను కూడా అనుమతించేది లేదంటున్న టీటీడీ ! 


స్ధానిక వ్యాపారస్తులు పంచెలు, వివిధ రకాల బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయో డిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్లు గాని ఉపయోగించాలని  అధికారులు సూచిస్తున్నారు.. అంతే కాకుండా నిత్యవసరాల్లో‌ భాగంగా ఎక్కుగా ఉపయోగించే షాంపూ పొట్లాలను కూడా కొండపైకి భక్తులు తీసుకెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారు.. భక్తులు తమ అవసరాల నిమిత్తం తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్, వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే విజిలెన్స్ సిబ్బంది గుర్తించి, ప్రత్యేకంగా డస్ట్ బిన్లల్లో పడేస్తున్నారు అధికారులు.. అంతే‌కాకుండా బ్రాడ్ కాస్టింగ్ ద్వారా భక్తులను సూచనలు చేస్తున్నారు.  తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తీర్చి దిద్దాలి అంటే టీటీడీకి భక్తులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


కొన్ని విషయాల్లో పునరాలోచించాలంటున్న వ్యాపారులు 


తిరుమలలో ప్లాస్టిక్ నిషేధంపై స్ధానిక వ్యాపారుల వాదన మరోలా ఉంది.. టిటిడి నిర్ణయంకు తాము ఎల్లప్పుడూ వ్యతిరేకం కాదని, పూర్తి స్ధాయిలో తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించడం కష్టతరంమని, చాలా వరకూ దుకాణాల్లోని వస్తువులకు ప్లాస్టిక్ కవర్లు ప్యాకింగ్ వస్తుందని,‌ వివిధ నగరాల‌ నుండి వచ్చే ప్లాస్టిక్ బొమ్మలకు ప్యాకింగ్ ను తొలగిస్తే అముడు పోవడం కష్టంమని అంటున్నారు.. ఇప్పటికే దశల వారిగా ప్లాస్టిక్ నిర్మూలిస్తున్న టిటిడి దుకాణదారులపై కక్ష పూరితంగా వ్యవహరించడం సబబు కాదని అంటున్నారు.. ప్లాస్టిక్ నిషేధంపై టిటిడి తీసుకున్న నిర్ణయంపై మరోక సారి పునరాలోచించాలని వ్యాపారస్తులు కోరుతున్నారు..