చిత్తూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యువతకు ప్రతీ ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామని, వడ్డెర్ల కు రాజకీయ, ఉపాధి అవకాశాల్లో పెద్ద పీట వేస్తాం అన్నారు లోకేష్. అధికారంలోకి వచ్చిన వెంటనే వి.కోటలో డిగ్రీ కాలేజి, ముస్లింల సంక్షేమాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తాం, టిడిపి అధికారంలోకి రాగానే విదేశీవిద్యను పునరుద్దరిస్తాం అని తన పాదయాత్రలో హామీ ఇచ్చారు. టిడిపి హయాంలో మల్బరీ రైతులకు ఇచ్చిన సబ్సడీలను వైసిపి ప్రభుత్వం ఎత్తేసిందన్నారు. మార్కెటింగ్ సమస్య ఎదుర్కొంటున్నాం. సీడ్ కూడా కర్నాటక రాష్ట్రంలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కిలోకు 50రూపాయలు ఇస్తున్న ఇన్సెంటివ్ ను పెంచి ఇవ్వాల్సిందిగా లోకేష్ ని కోరారు.
యువగళం 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్
నారా లోకేష్ 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. పలమనేరు నియోజకవర్గంలో 5 వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 8-00 గంటలకు రామక్రృష్ణాపురం టోల్ గేట్ వద్ద క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభిస్తారు లోకేష్. అనంతరం 10-30 గంటలకు కస్తూరి నగరం క్రాస్ వద్ద తమిళ గౌడ్ (రెడ్డి) కులస్తులతో ముఖాముఖి అయి ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరిస్తారు. వారి కష్టాలు, బాధలు, సమస్యలు అడిగి తెలుసుకుంటారు.
ఉదయం 11-40 గంటలకు, కైగల్లు గ్రామం చేరుకోనున్నారు. అనంతరం 10 నిముషాల పాటు యాదవ కులస్తులతో ముఖాముఖి కానున్నారు నారా లోకేష్. యాదవుల సంక్షేమానికి టీడీపీ
చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రసంగింనున్నారు. మధ్యాహ్నం 12-30 గంటలకు పాదయాత్ర దేవదొడ్డి చేరుకోనుంది. అక్కడ బీసీ మహిళలు,బీసీ సంఘాలతో ముఖాముఖి అవుతారు. మధ్యాహ్నం 12-50 గంటలకు భోజనం.. దేవదొడ్డి వద్ద విరామం తీసుకుంటారు. తర్వాత పార్టీ నాయకులతో ముఖాముఖి.. అనంతరం సాయంత్రం 4-15 గంటలకు బైరెడ్డి పల్లె... టౌన్ రాయల మహాల్ లో బీసీ నాయకులతో నారా లోకేష్ అంతర్గత సమావేశం కానున్నారు.
సాయంత్రం 5-15 నిముషాలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు లోకేష్. అనంతరం టీటీడీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు,ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6-55 గంటలకు
కస్తూరి స్కూల్ (కమ్మపల్లి ) వద్దకు చేరిక, రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మంగళవారం నాడు 5 వ రోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.
5 వ రోజు నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్..
- ఉదయం 8-00 గంటలకు రామక్రృష్ణాపురం టోల్ గేట్ వద్ద క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభం..
- 10-30 గంటలకు కస్తూరి నగరం క్రాస్ వద్ద తమిళ గౌడ్ (రెడ్డి) కులస్తులతో ముఖాముఖి.. ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరణ..
- 11-40 గంటలకు, కైగల్లు గ్రామం చేరిక, 10 నిముషాల పాటు యాదవ కులస్తులతో ముఖాముఖి.. యాదవుల సంక్షేమానికి టీడీపీ చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రసంగం..
- మధ్యాహ్నం 12-30 గంటలకు దేవదొడ్డి చేరుకోనున్న పాదయాత్ర.. అక్కడ బీసీ మహిళలు,బీసీ సంఘాలతో ముఖాముఖి..
- 12-50 గంటలకు భోజనం... దేవదొడ్డి వద్ద విరామం తర్వాత పార్టీ నాయకులతో ముఖాముఖి..
- సాయంత్రం 4-15 గంటలకు బైరెడ్డి పల్లె... టౌన్ రాయల మహాల్ లో బీసీ నాయకులతో అంతర్గత సమావేశం..
- సాయంత్రం 5-15 నిముషాలకు పార్టీ జెండా ఆవిష్కరణ.. టీటీడీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు,ప్రజలను ఉద్దేశించి ప్రసంగం..
- సాయంత్రం 6-55 గంటలకు కస్తూరి స్కూల్ (కమ్మపల్లి ) వద్దకు చేరిక, రాత్రి బస చేయనున్నారు
5 వ రోజు లోకేష్ పాదయాత్ర మొత్తం 15 కిలోమీటర్ల మేర సాగనుంది.