Andhra Pradesh News: ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర ప్రత్యేకం. గురువు అడుగు మన జీవన విధానాన్ని నేర్చుకుంటారు. అలాంటి గురువులకు నేడు పూజోత్సవం.


ఉత్తమ ఉపాధ్యాయిడికి జాతీయ అవార్డు


శ్రీకాళహస్తి నియోజకవర్గ ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా కూనాటి సురేష్ పని చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పై డిజిటల్ విద్యలో అవగాహన పెంచేందుకు పలు రకాల వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏపీ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిడిగా ఎంపికైయ్యారు. రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందుకోనున్నారు.


Also Read: పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సత్తా టీచర్స్​కే ఉంది.. వారు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే


18 అవార్డులు
సురేష్ విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యే విధంగా విశ్లేషణాత్మక బోధన చేసే విధంగా 2009లో డిజిటల్ విద్యావిధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. గురుదేవా డాట్ కాం వెబ్ సైట్ ద్వారా 44 లక్లల విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోవైపు సాంఘిక శాస్త్రం లెర్నింగ్ యాప్ ను రూపొందించి విద్యార్థులతోపాటు ఎంతో మంది ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా మార్చారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కావాల్సిన సాంఘికశాస్త్రం..  వరకు  నూటికి నూరు శాతం మార్కులు సాధించేలా కృషి చేస్తున్నారు. సురేష్ చేస్తున్న విద్య అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 17 అవార్డులు ఇప్పటివరకు సాధించారు. ప్రస్తుతం ఎమపికైన అవార్డుతో 18వ అవార్డులు అందుకున్నారు.


జిల్లాలో ఉపాధ్యాయ అవార్డులు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు, తిరుపతి జిల్లాలో గురువారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 71 మంది ఉపాధ్యాయులకు తిరుపతిలోని కచ్చపి కేంద్రంలో అవార్డులు ప్రదానోత్సవం జరగనుంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించారు. గురువారం వారికి ప్రముఖుల చేతుల మీదుగా జిల్లా జడ్పీ కార్యాలయంలో అవార్డులను ప్రదానం చేశారు.


Also Read: టీచర్స్​ డేకి మీ ఫేవరెట్​ ఉపాధ్యాయులకు ఇలా విష్ చేసేయండి.. సోషల్ మీడియాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి