Andhra Pradesh News | హైదరాబాద్: ఏపీ ప్రజలకు, తెలుగు వారికి ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా (RK Roja) భోగి శుభాకాంక్షలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి సంక్రాంతి లాంటి పండుగులు జరుపుకోవడం వల్ల మనకు తెలియని, దూరపు బంధువులు కూడా తెలిసే అవకాశం ఉందన్నారు. నగరిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి భోగి మంటలు వేసి పండుగ జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల భవిష్యత్ తరాలకు మన పండుగ, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని రోజా పేర్కొన్నారు. తెలుగు ప్రజలు భోగ భాగ్యాలతో, ఆరోగ్యంతో ఎల్లప్పుడూ సుఖశాంతులతో సంతోషంగా రోజా ఆకాంక్షించారు.


ఏపీలో ఎవరూ సంతోషంగా లేరన్న రోజా
గతంలో వైసీపీ పాలనలో సంతోషంగా సంక్రాంతి జరుపుకున్నారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలు బాధతో ఉన్నారని రాష్ట్రం మొత్తం కళ్లారా చూస్తోంది. నగరి నియోజకవర్గంలోనూ ప్రజలు సంతోషంగా లేరు. గతంలో వైసీపీ పాలనలో కొత్త బట్టలు ధరించి, పిండి వంటలు, భోగి మంటలతో సంతోషంగా పండుగ జరుపుకునేవారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేయలేదు. దాంతో సంక్రాంతి వచ్చినా ఏ కుటుంబంలోనూ సంతోషం కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసింది. సంక్రాంతి అంటే రైతుల పండుగ, కానీ ఈ పండుగ నాడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు.






 


భోగి పండుగరోజు భోగి మంటల సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. కరెంట్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడు మరింత నష్టపోతున్నారు. దాంతో కూటమి 7 నెలల పాలనలో చీకట్లు నెలకొన్నాయి. ఈ భోగి మంటలతోనైనా వారి కష్టాలు తొలగిపోవాలని, వారి జీవితాల్లో వెలులు నిండాలని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. 


Also Read; Vangalapudi Anitha Bhogi Celebrationa: భోగి వేడుకల్లో పాల్గొన్న వంగలపూడి అనిత, కూతురితో పోటీపడి మరీ డ్రమ్స్ వాయిస్తూ సందడి