అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొలి రోజు భోగి నాడు భోగి మంటలు వేసి చెడు తొలగిపోవాలని ఆకాంక్షింస్తున్నారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. హోం మంత్రి వంగలపూడి అనిత భోగి వేడుకల్లో పాల్గొని డ్రమ్స్ వాయించారు. పిల్లలతో కలిసి అంతే ఉత్సాహంగా ఆమె భోగి వేడుకల్లో పాల్గొన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

హోం మంత్రి అనిత ఇంటి వద్ద జరిగిన భోగి వేడుకల్లో కళాకారులు కేరళ నృత్యంతో సందడి చేశారు. అంతకు ముందు వంగలపూడి అనిత కొబ్బరికాయ కొట్టి, అనంతరం భోగి మంటలు వేశారు. తెలుగు ప్రజలకు హోం మంత్రి అనిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండుగ ప్రజల జీవితాల్లో భోగభాగ్యాలతో పాటు కొత్త వెలుగు నింపాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు.

 

Also Read: Bhogi Wishes: భోగి మంటలతో సమస్యలు తీరిపోయి భోగ భాగ్యాలు కలగాలి- సీఎంల భోగి శుభాకాంక్షలు