Roja followers arrested for sand smuggling in Nagari: మాజీ మంత్రి రోజా అనుచరులు నగరిలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అరెస్టు కావడం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నారు. మూడు రోజుల క్రితం చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు టిప్పర్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. చెన్నైకి చెందిన భరత్ అనే వ్యక్తి సహా మొత్తం ఏడుగుర్ని అరెస్టు చేశారు. భరత్ ఇచ్చిన సమాచారం మేరకు నగరి వైసిపి 11వ వార్డు కౌన్సిలర్ బిలాల్, 14వ బిడి బాస్కర్ లను అరెస్టు చేశారు. వీరు ఐదేళ్ళుగా చెన్నైకి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.
అక్రమ కేసులని రోజా ఆగ్రహం వైసీపీ కౌన్సిలర్లపై పెట్టిన అక్రమ కేసులని రోజా ఆరోపించారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నారని..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులపై ఎలా పెట్టాలో ఏపీ లో స్టడీ చేయాలని ఎద్దేవా చేశారు. గాలిలో గెలిచిన గాలి గాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ అని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదన్నారు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరి కు వచ్చి తమిళనాడుకు టిప్పర్ లు తో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని.. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పై నగరి సి. ఐ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ లు బీడీ భాస్కర్ , బిలాల్ లను అరెస్టు చేసి, తప్పుడు కేసులు పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. నగరి లో 13వేల టన్నులు బియ్యం మాఫియా జరిగిందన్నారు. టిడిపి నేత అమృత రాజ్ ను అరెస్ట్ చేశారు, వెంటనే అతనికి బెయిల్ ఎలా ఇచ్చారని రోజా ప్రశ్నించారు.
కాణిపాకంలో రోజా ప్రమాణం చేయగలదా ?
మాజీ మంత్రి రోజా ఆరోపణలపై గాలి భాను ప్రకాష్ సవాల్ చేశారు. రోజాకు నీకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చెయ్యాలన్నారు. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్న సరే సిద్ధమని గాలి భానుప్రకాష్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ళుగా ఇసుక ,బియ్యం అక్రమ రవాణాలో రోజా, అమె అన్నదమ్ములకు, అమె అనుచరులకు సంబంధం లేదని చెప్పగలదా.. ప్రమాణం చేయాగలదా అని సవాల్ చేశారు. నేను ప్రమాణం చేయడానికి సిద్దమన్నారు. దోంగే.. దోంగ అన్నట్లుగా ఉంది రోజా మాటలు ..వైసిపి నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే , పట్టించిందే తామన్నారు. అడ్డంగా దోరికిపోయి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శఇంచారు. రోజాకున్న అవినీతి అలవాట్లు మాకు రుద్దే ప్రయత్నం చేస్తోందని.. రోజా కళ్ళుకు ఎమైనా ఇబ్బంది గా ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నారు.
నగరిలో ఎన్నో అభివృద్ధి పనులు
నగరి చరిత్రిలో ఎన్నుడు లేని విధంగా ఎడాదిలో వందలాది కోత్త రోడ్లు వేశాను, బోర్లు,కాలువలు ఇతర అభివృద్ధి చేశాను.. రోజా ఎప్పుడైన నగరిలోని ఊర్లు తిరిగితే తెలుస్తుందన్నారు. అబద్ధాలు చెప్పి కాలం గడపాలనుకునే రోజులు పోయాయి అని రోజా గుర్తుపెట్టుకోవాలన్నారు. సోషల్ మీడియాలోనూ నీకు తెలిసిన ఛానల్లోనూ అబద్ధాలు చెప్పితే నిజమైపోదని.. అద్దె ఇంట్లో ఉండే స్థాయి నుండి ఇప్పుడు నగరి,హైదరాబాదు, చెన్నై ఇలా ఊరుకోక ఇళ్ళు కట్టున్నావ్.... ఇవన్ని ఎలా సంపాదించావని ప్రశ్నించారు. నీ హావభావాలు, వెకిలిచేష్టాలు అన్ని ప్రజలు తెలుసని.. ఒక ఆడది ఎలా ఉండకూడదు అన్నదానికి ప్రతిబింబం నువ్వు అని మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.