Tirupati Darshan: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని ఏడాదికి ఓసారి అయినా దర్శించుకోవాలని కొందరు, అవకాశం ఉండే నాలుగైదు నెలలకోసారి తిరుమల వెళ్లాలని ఇంకొందరు. స్వామివారి సన్నిధి నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలుగుతుంటుంది. ప్రత్యేకరోజులు, పండుగలు వస్తే ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఆ స్వామివారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. జూలై 17 గురువారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు శిలాతోరణం వరకూ వేచి ఉన్నారు. 

జూలై 16 బుధవారం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య  75,104 

శ్రివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,896 మంది 

జూలై 16 తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16  బుధవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ కన్నులపండువగా నిర్వహించారు. 

వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు

శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందిపడకుండా దర్శనం సులభంగా అయ్యేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం టిక్కెట్ల బుకింగ్, రూమ్స్, భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలపైనా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ సమాచారం అందిస్తున్నారు

అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను జూలై 19 ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్లో విడుదల చేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది..వారికి మాత్రమే  లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ వెల్లడించింది.

కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, వార్షిక పుష్పయాగం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు జూలై 22 ఉదయం విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్ల కోటా రిలీజ్ చేస్తారు. జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్‌ కోటా రిలీజ్ చేస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

 అక్టోబర్‌లో తిరుమల  శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? - ఇవిగో టిక్కెట్లు, గదులకు సంబంధించి పూర్తి సమాచారం..ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

ఓం నమో వెంకటేశాయ