శివపూజ నియమాలు: గర్భధారణ సమయంలో పూజలు చేయడం, ప్రతిక్షణం ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండడం శుభప్రదంగా భావిస్తారు.  ఇది గర్భంలో పెరుగుతున్న బిడ్డపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో ఎలా ప్రవర్తిస్తే, బిడ్డపై కూడా అదే ప్రభావం ఉంటుందని కూడా చెబుతారు. అందుకే ధర్మ శాస్త్రాలలో గర్భిణీ స్త్రీ పూజలు చేయాలి, మంత్రాలు పఠించాలి,  భగవద్గీత పఠించాలని సూచిస్తారు కానీ శివలింగాన్ని పూజించడం గురించి మాత్రం శాస్త్రాల్లో  కొన్ని నియమాలున్నాయి. గర్భధారణ సమయంలో శివలింగాన్ని పూజించకూడదనే ప్రచారం ఉంది. ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోందో ఇక్కడ తెలుసుకోండి

గర్భధారణ సమయంలో శివలింగ పూజ చేయడం సరైనదా కాదా?

శివుడిని పూజించడం వల్ల భక్తులకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రక్షణ, శాంతి ఉంటుంది. అదే సమయంలో, శివుని పూజలో చాలా కఠినమైన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు..ఎందుకంటే శివుడు భోళా శంకరుడు. ఎవరైనా పూజించవచ్చు, కొద్దిపాటి నీటితో అభిషేకం చేసినా శివయ్య కరిగిపోతాడు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు సాధారణ పద్ధతిలో శివలింగ పూజ  చేయవచ్చు.  శాస్త్రాల గురించి మాట్లాడితే, గర్భధారణ సమయంలో శివలింగ పూజ చేయకూడదని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు.

గర్భధారణ సమయంలో శివలింగ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలోనే కాకుండా మానసిక ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమయంలో స్త్రీ కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తుంది, మరికొన్నిసార్లు చాలా భావోద్వేగంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శివపూజ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది, ఆందోళన తగ్గుతుంది.  భావోద్వేగ ఆలోచనలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో శివలింగ పూజ చేయడం వల్ల ప్రతికూల శక్తి  నీడ మీ బిడ్డపై పడదు. గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరి మానసిక మరియు శారీరక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఈ పద్ధతిలో పూజ చేయండి

గర్భధారణ సమయంలో స్త్రీ శివలింగ పూజ చేయవచ్చని  ఇందులో ఎటువంటి నిషేధం లేదని పండితులు చెప్పారు. అయితే ఈ స్థితిలో పూజ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి, ఎక్కువ సమయం నిలబడి పూజ చేయవద్దు. బదులుగా, ప్రశాంతంగా కూర్చుని పూజించండి. మీరు నేలపై కూర్చోలేకపోతే, కుర్చీ లేదా చిన్న టేబుల్ మీద కూర్చుని కూడా పూజ చేయవచ్చు. గర్భధారణ సమయంలో మీరు కఠినమైన ఉపవాసం లేదా నిర్జల వ్రతం లేకుండా శివలింగంపై నీరు సమర్పించవచ్చు. ఇంటి నుంచి ఆలయం దూరంగా ఉంటే లేదా ఆలయంలో ఎక్కువ మెట్లు ఎక్కాల్సి వస్తే, మీరు ఇంట్లో చిన్న శివలింగాన్ని ప్రతిష్టించి పూజించవచ్చు.

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ఏబీపీ దేశం  ధృవీకరిండం లేదు.  ఈ సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.