VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ కడప జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలి..


ఆలయం వెలుపల కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే, రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్ ను గద్దె దింపి టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కడప పార్లమెంట్ స్థానంలో నన్ను, పులివెందుల స్థానంలో బీటెక్ రవిని గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. అధికార ప్రతినిధులు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నట్లు వెల్లడించారు.


రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. 


బీటెక్ రవి మాట్లాడుతూ.. పులివెందుల అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీనివాస్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకుని ప్రచారం ప్రారంభింస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఏపీ సీఎం జగన్ తన ఆదాయాన్ని మాత్రం భారీగా పెంచుకుంటున్నారని, ఇకనైనా సీఎం జగన్ కు మంచి మనస్సు ఇచ్చి, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేయాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చడంపై వారికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై లేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను క్షేత్ర స్థాయిలో తిరిగి పరామర్శించారని... కానీ సీఎం జగన్ మాత్రం గాల్లో తిరిగి అటు నుంచి అటే వెళ్లిపోయారని విమర్శించారు. 


వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రావాలి..


అలాగే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు సాయం న్యాయబద్దంగా లేదని విమర్శించారు. అదే టీడీపీ హయాంలో హుద్‌హుద్ తుఫాను సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.15 వేలు ఇచ్చారని, అలాగే తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ.20 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2020లోనే పూర్తయి ఉంటే ఈ వరద ముంపు వచ్చేది కాదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించాలని.. అప్పుడే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని బీటెక్ రవి కామెంట్లు చేశారు. 
Also Read: BJP Vs YSRCP : కేంద్రంపై విమర్శల జోరు పెంచుతున్న వైఎస్ఆర్‌సీపీ ! బీజేపీతో దూరం పెరుగుతోందా ? జరుగుతోందా ?


Also Read: Undavalli : పోలవరం కట్టకుండానే భద్రాచలం ఎలా మునుగుతుంది ? పనులపై ఏపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఉండవల్లి !