చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కల్యాణ్‌పై నారా లోకేశ్ చేసిన కృతజ్ఞతా పూర్వక వ్యాఖ్యలపై గుంటూరు మేయర్ కావటి మనోహర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. నారా లోకేశ్ నిన్న (సెప్టెంబరు 11) మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఒక అన్న లాగా తమకు మద్దతుగా నిలవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ను అన్న అని పిలవటంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టాడా అని వైఎస్ఆర్ సీపీ గుంటూరు మేయర్ కావటి మనోహన్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు.
మేయర్ వ్యాఖ్యలను బట్టి సీఎం జగన్ ను జగన్ అన్నా అనే వారంతా వైఎస్ రాశేఖర రెడ్డికి పుట్టినట్టు ఒప్పుకుంటారా? అని నిలదీశారు. అటు చంద్రబాబు అరెస్ట్ అయితే మంత్రి రోజా వేడుకలు చేసుకోవడం దారుణం అని అన్నారు. జగన్ ఏమైనా నితివంతుడా? అని నిలదీశారు. ఆయనపైన 30కి పైగా కేసులు ఉన్నాయని విమర్శించారు.
‘‘రోజా నువ్వు నీ నాయకుడు అవినీతి పరులు కాదా? రోజా నీతివంతురాలు అని కాణిపాకంలో ప్రమాణం చేయాలి. ఆరు నెలల తర్వాత వైసీపీ ప్యాకప్, జగన్ లాక్ అప్. అక్రమంగా ఆర్జించి బంగళాలు, కార్లు కొన్నది మీరు కాదా? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోజా ఆస్తులు మొత్తం కబ్జా చేస్తాం. జగన్ రాష్ట్రంలో బూతుల స్కూల్స్ నడుపుతున్నారు. రోజాకు చిలుక గిప్ట్ గా ఇస్తున్నాం. ఆరు నెలల తర్వాత జాతకాలు చెప్పుకొనే బతకాలి’’ అని కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారు.