తిరుపతి: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాలు, శిలా తోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో భక్తులు సమాచారం అందించారు. దీంతో సకాలంలో స్పందించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు కారణంగా ఆ ప్రాంతాని దట్టమైన పొగ వ్యాపించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.