Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సోమవారం కీలక మార్పునకు శ్రీకారం చుట్టారు. సచివాలయం నుంచి వర్చువల్‌గా 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్‌లు ప్రారంభించారు. ఇక్కడ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారులు, వివిధ రంగాల నిపుణుల బృందాన్ని కూడా అందుబాటులో ఉంచుతారు. ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్య, వాటికి పరిష్కార మార్గాలు, ఇతర అంశాలపై ఇక్కడ చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేస్తారు.
స్వర్ణాంధ్ర విజన్ యూనిట్‌ల ద్వారా రాష్ట్ర భవిష్యత్ మరో స్థాయికి వెల్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 45ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నాని ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక ఆఫీస్‌లు లేవని ఎవరైనా వెళ్తే గెస్ట్ హౌస్‌లు, లేదా పార్టీ ఆఫీస్‌లనే వాడుకుంటున్నారని అన్నారు. వారిని కలవడం ప్రజలకి కూడా ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు స్వర్ణాంధ్ర్ విజన్ యూనిట్‌లో ప్రత్యేక ఆఫీస్ ఉంటుందని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్‌లో ఒక నోడల్ అధికారి కూడా ఉంటారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చన సమస్యలు తన స్థాయిలో పరిష్కారం అయ్యే వాటిని ఆ వ్యక్తి పరిష్కరిస్తారు. లేదా అంటే కలెక్టర్‌తో మాట్లాడతారు. ఇది రాష్ట్ర పరిపాలనోల సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అధికారులు, నిపుణుల బృందంఅధికారులు, నిపుణుల బృందాన్ని ఈ విజన్ సెంటర్‌లో ఉంచుతారు. సచివాలయం నుంచి ఐదుగురు ఉద్యోగులతో కూడిన టీం కూడా ఈ ఆఫీస్‌లో పని చేస్తుంది. ఈ బృందం కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంది.
స్వర్ణాంధ్ర విజన్ యూనిట్‌ల ముఖ్యమైన పని గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడం. ప్రతి నియోజకవర్గంలో ఒక నోడల్ అధికారి ఉంటారు, ఇతను ఎమ్మెల్యేల సహాయంతో సమస్యలు నేరుగా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తారు. ఉదాహరణకు రోడ్డు దెబ్బతినడం, నీరు అందకపోవడం, లేదా విద్యుత్ సమస్యలు వంటివి సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయి. ఈ వ్యవస్థ ప్రజల సమస్యలు సులభంగా పరిష్కారమయ్యేందుకు దోహదపడుతుంది. గ్రామాల్లో పాలనను మెరుగుపరుస్తుంది.
మౌలిక వసతుల కల్పనవిజన్ ఆఫీస్‌లలో మౌలిక వసతుల కోసం రూ. 10 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం సీఎం చంద్రబాబు చెప్పినట్టు "స్వర్ణాంధ్ర 2047 యూనిట్‌లో ఎమ్మెల్యే చైర్మన్‌గా, జిల్లా అధికారి నోడల్ అధికారిగా ఉంటారు. ఈ కార్యాలయాల్లో మంచి కుర్చీలు, టేబుల్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం." ఈ నిధులతో కార్యాలయాలు సిద్ధం అవుతాయి, ఇది ఎమ్మెల్యేలకు ,అధికారులకు పనిచేయడానికి సులభం అవుతుంది.
స్వర్ణాంధ్ర లక్ష్యాలుస్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పించారు సీఎం చంద్రబాబు. "హెల్దీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అనేది ప్రభుత్వ లక్ష్యం. అందరి ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి." అనే నినాదంతో పని చేస్తున్నారు. 2029 నాటికి స్వల్పకాలిక లక్ష్యాలు సాధించేందుకు ఎమ్మెల్యేలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ యూనిట్‌లు సమస్యలను పరిష్కరించడమే కాదు, స్పష్టమైన లక్ష్యాలను సాధించడానికి పనిచేస్తాయని అన్నారు.
ఆర్టీజీఎస్ పర్యవేక్షణఆర్టీజీఎస్ (Real-Time Governance System) ఆధ్వర్యంలో ఆవేర్ వ్యవస్థ ద్వారా 40 పారమీటర్స్‌ను రియల్‌టైమ్‌లో పరిశీలిస్తారు. ఇందులో గాలి నాణ్యత, ఉష్ణోగ్రత, కాలుష్యం, వరదలు, నీటి మట్టాలు అన్నింటి గురించి తెలుసుకుంటారు.
లక్ష్యాల కోసం ప్లాన్ చేయడంస్వర్ణాంధ్ర విజన్‌ను 2047 నాటికి రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా యూనిట్‌లు ప్లాన్‌లు రూపొందిస్తాయి. ఎమ్మెల్యేలు ఈ యూనిట్‌ల్లో చైర్మన్‌లుగా ఉంటూ, జిల్లా అధికారులతో కలిసి 2029 నాటికి చిన్న లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తారు. ఉదాహరణకు, రైతుల ఆదాయం పెంచడం, గ్రామాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరచడం వంటి పనుల కోసం ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి.
నిపుణుల మద్దతుఈ యూనిట్‌ల్లో నిపుణుల బృందం ఉంటుంది. ఆ టీంలు ఎమ్మెల్యేలకు సలహాలు ఇస్తుంది. నాలెడ్జి భాగస్వామిగా ఒక ఉత్తమ విద్యాసంస్థను ఎంపిక చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలను సూచిస్తుంది. అదనంగా, ఒక నిపుణుడు లక్ష్యాలను సాధించడానికి గైడ్ చేస్తారు. సచివాలయం నుంచి ఐదుగురు ఉద్యోగులతో కూడిన బృందం కూడా ఉంటుంది. డేటా సేకరణ, ప్లాన్ అమలు వంటి పనుల్లో వీరు సహాయపడతారు.