Tirupati News: తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన చేసుకోవడం పుణ్యఫలమని ప్రతి హిందూ భక్తుడి ఆశ. ఏడాదిలో జరిగే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తారు. ఇంటిళ్లపాది.. గ్రామాలకు గ్రామాల ప్రజలు... ఇతర బంధువులతో కలిసి పాదయాత్రగా చేరుకుని సప్తగిరులను అధిరోహిస్తారు. గంటలు... రోజులు గడిచిన వేచి ఉండి.. చలికి.. వానకు... ఎండకు సైతం లెక్కచేయకుండా స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తమ ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అదే విధంగా స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతి కి చేరుకున్నారు. 


ఆటో, ట్యాక్సీల వారిది కూడా తప్పు


వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు బస్టాండు, రైల్వే స్టేషన్ కు 8వ తేదీ ఉదయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆటోలు, ట్యాక్సీలు వారు తమ స్వార్థం కోసం అధిక డబ్బులు తీసుకుని భక్తుల కోసం టీటీడీ తిరుపతి లో ఏర్పాటు చేసిన 8 టోకెన్ల కేంద్రాల వద్దకు తరలించారు. ఇవి బయట భక్తులకు ఎక్కడ ఉన్నాయో తెలియదు కనుకు ఆటో, ట్యాక్సీల వారు తరలించారని భక్తులు కొందరు తెలిపారు. ఇక 8వ తేదీ ఉదయం నుంచి భక్తులు వచ్చిన వారిని వచ్చినట్లు క్యూ అనుమతించకపోగా అందరిని రోడ్డు పై, టోకెన్ల జారీ కేంద్రం వద్ద బారులు తీరారు. ఇక చిన్నపాటి రోడ్డు, స్థానికులకు రోడ్డు పై ట్రాఫిక్ అంతరాయం,  పైగా ఉన్న రోడ్డులోనే ఫ్యాన్సింగ్ క్యూ లైన్లు ఏర్పాటు చేసిన కారణంగా బైరాగిపట్టెడ వద్ద పక్కనే ఉన్న పార్కులోని భక్తులకు అనుమతించి అక్కడే నిలబెట్టారు. ఈ క్రమంలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6మంది మృతి చెందగా.. 50 మంది వరకు గాయాలపాలయ్యారు.


ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో


తొక్కిసలాట ఘటన జరిగిన రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం తిరుపతి లో పర్యటించారు. ఈ క్రమంలో పలువురు తెలిపిన వివరాల ప్రకారం తప్పిదం జరిగిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తిరుపతి క్రైం డీఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్ ను సస్పెండ్ చేశారు. టీటీడీ సీవీఎస్వో, జిల్లా ఎస్పీ , టీటీడీ జేఈవో ను బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు. ఆ తరువాత ఇటీవల తిరుపతి టౌన్ డీఎస్పీని సైతం హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో విచారణ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు పోలీస్ శాఖ నుంచి సమాచారం.


ఈ నివేదిక ఆధారంగా ఎవరి పై ఎలాంటి చర్యలు ఉంటాయి.. ఎవరిపై వేటు పడుతుందా.. టీటీడీ ఈవో, అదనపు ఈవో పై చర్యలు ఉంటాయా లేక కింద స్థాయిలో విధులు నిర్వహించిన పోలీస్, టీటీడీ ఉద్యోగులు పైన చర్యలు ఉంటాయా... బైరాగి పుట్టెడు కేంద్రం వద్ద మాత్రమేనా లేక అన్ని కేంద్రాల్లో విచారణ జరిగిందా.. అక్కడ లోటుపాట్లు ఉంటే ఎవరిని బాధ్యులను చేస్తారు. టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తారు కాని కింద స్థాయిలో అధికారులు చేయాల్సిన పనులు లోపం ఎంత... ఇలా వివిధ కోణాల్లో నెలకొన్న అంశాలు ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపై నివేదిక బయటపెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.