Less Rush at Tirumala: నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే అలిపిరి నడకమార్గం నిర్మానుష్యంగా కనిపించింది. తిరుమలలో వన్యప్రాణుల సంచారం‌తో అలిపిరి నడక మార్గం ఖాళీగా మారింది. నడక మార్గంలో చిరుతపులి (వన్య ప్రాణుల) సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరుత లాంటి వన్య ప్రాణుల సంచారం అదుపులోకి వచ్చేంత వరకూ ప్రతి భక్తుడికి చేతికర్ర అందించేందుకు హైలెవెల్ కమీటీ‌ నిర్ణయం తీసుకుంది. 


అలిపిరి నడకమార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 తరువాత అనుమతించడం లేదని చెప్పారు. అయితే తిరుమలలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో నిర్మానుష్యంగా మారింది.  నిత్యం గోవింద నామ స్మరణతో కిటకిటలాడే అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గాల్లో భక్తుల తాకిడి చాలా తగ్గింది. వన్య ప్రాణుల సంచారం ఉన్నందున నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊతకర్ర ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి దాదాపు 100 మంది భక్తులకు గుంపులుగా నడకమార్గంలో పంపిస్తున్నారు. అదే విధంగా భక్తుల భద్రతకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనుంది.. నడక మార్గంలోని దుకాణదారుకు వ్యర్ధాలను బయటకు వేయకుండా ఉంచితే చర్యలు తీసుకోవడంతో పాటుగా, అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయనుంది


తిరుమలలో మరోసారి చిరుత కలకలం
ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచరిస్తుండగా.. బాలికపై దాడి చేసి చంపేసిన తరువాత బోనులు ఏర్పాటు చేయడంతో ఒక చిరుత చిక్కింది. అంతలోనే తిరుమలలో మరోసారి ఓ చిరుత కలకలం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వద్ద చిరుత కనిపించడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా వేద విశ్వవిద్యాలయంలో రాత్రి చిరుత సంచరించినట్లు గుర్తించారు. వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో చిరుత కనిపించడంతో విద్యార్థులు పరుగులు తీశారు. టీటీడీ అధికారులకు, అటవీశాక అధికారులకు సమాచారం అందించారు.