రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంపింగ్ చేస్తుంటే.... మరికొన్ని పార్టీలో కీలక నేతలు గూటిని వీడుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతున్నాయి.


కాంగ్రెస్‌లో జరుగుతున్న కీలకపరిణామాల్లో వైఎస్‌ షర్మిల పార్టీ వీలనం ఒకటి. దీన్ని తెలంగాాణ కాంగ్రెస్ లీడర్లు వ్యతిరేకిస్తున్నారని టాక్ నడుస్తున్న టైంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే స్వాగతిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వైఎస్సార్ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం అన్నారు. తిరుమల శ్రీవారిని బట్టి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


కొన్ని భావోద్వేగాల వల్ల కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని తెలిపారు భట్టి. ఇప్పుడు తిరిగి వైఎస్ షర్మిల సొంతింటికి వస్తున్నట్లు భావిస్తున్నామని బట్టి విక్రమార్క హర్షించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బిజెపికి బీ టీం లాంటి పార్టీ అని విమర్శించారు. బిజెపి వ్యతిరేక కూటమిలో చీలికలు తీసుకొచ్చి.... బిజెపికి ఉపయోగపడేందుకే బిఆర్ఎస్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రానికి బీఆర్ఎస్ వల్ల ఒరిగిందేమీ లేదని బట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఇప్పటికే బట్టి మార్గంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో కలుస్తానంటే స్వాగతిస్తామంటూ ఆహ్వానించారు.


వైయస్ షర్మిల చేరికపై కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకగలం......


వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహగానాల నడుమ కాంగ్రెస్ లోనే మరో వర్గానికి చెందిన నాయకులకు మాత్రం షర్మిలను పార్టీలో చేర్చుకుంటే చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యమ సమయంలో ఆమె సమైక్యాంధ్ర గళం వినిపించి... ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టి తెలంగాణలో అడుగు పెట్టాను అంటున్నారు. ఆమె కాంగ్రెస్లో చేరితే కచ్చితంగా బిజెపి బీఆర్ఎస్ పార్టీలకు బలం ఇచ్చిన వారం అవుతామని కొందరు ముఖ్య నేతలు భావిస్తున్నారు.


వైఎస్ షర్మిల పార్టీలో చేరితే పాలేరు నియోజకవర్గ టికెట్ ఇవ్వాలి ఇప్పుడు అదే నియోజకవర్గంలోని బలమైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఆ టికెట్ ఆయనకు ఇవ్వడానికి పార్టీ సుముఖంగా ఉంది. అందుకని ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోకుండా ఉంటేనే మంచిదని ఆ వర్గం భావిస్తుంది.


తెలంగాణలో ఈసారి ఎలాగైనా రాజన్న రాజ్యం తీసుకురావాలని నినాదంతో వైఎస్సార్ టీపీని స్థాపించి వైఎస్ షర్మిల తన పార్టీని బాగా వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ... ప్రతి నియోజకవర్గంలో కలియ తిరిగారు. పాదయాత్ర సమయంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీంతో తీరికలేని సమయాన్ని గడుపుతూ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ... సీఎం కేసీఆర్ ను మూడోసారి గెలవకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


కొన్ని రోజుల నుంచి వైయస్ఆర్టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కాంగ్రెస్లో విలీనం చేస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ ఊహగానాలు మరింత పెరిగిపోయాయి. కాంగ్రెస్ లో  వైయస్ఆర్టిపి విలీనం దాదాపు ఖరారు అయినట్లేనని రాజకీయ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ లోని కొందరు ముఖ్య నాయకులు అనుకూలమైన ప్రకటనలు చేయడంతో మరింత ఆసక్తి రేకిత్తిస్తోంది.