చిత్తూరు జిల్లా సోమల మండలం,పెద్ద ఉప్పరపల్లెలో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరిగింది. సంక్రాంతి పండుగ ముందు, పండుగ అనంతరం పశువుల పండుగా పిలుచుకునే జల్లికట్టును చిత్తూరు జిల్లా వాసులు ఎంతో వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను గొప్ప పండుగగా భావించి గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో నిర్వహిస్తూ వస్తుంటారు. ఈ వేడుకలకు అటు కర్ణాటక, తమిళనాడు నుండే కాకుండా చుట్టు పక్కల దాదాపు 30 గ్రామాల ప్రజలు ఈ పశువుల పండుగను హాజరై ఉత్సహంగా తిలకిస్తారు.
ఈ పండుగ సందర్భంగా తమ ఇంటిలో ఉన్న ఆవులకు ఎద్దులకు స్నానాలు చేయించిన అనంతరం గోపూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజలు పశువుల కొమ్ములకు రంగులు వేస్తారు. అలాగే బహుమతులు కట్టి అశేష జనాల మధ్య పండుగను జరుపుకుంటారు. అలాగే పశువుల కొమ్ములకు కొంత ఉపకరణాలు లేక పైకం కట్టి బారికేడ్లు కట్టిన జనాల మధ్యకు ప్రభలు కట్టిన పశువులను వదులుతారు. ఈ ప్రభల మధ్య బహుమతులు చేజిక్కించు కోవడానికి యువకులు ముందుకు వస్తారు. వాటి పరుగులను అడ్డుకొని వాటికి కట్టిన బహుమతులు చేజిక్కించుకునేందుకు పోటీ పడతారు.
ఈ జల్లికట్టు పోటీలలో అక్కడ పాల్గొన్న యువకులు గాయాలు కావచ్చు లేక మరణాలు కూడా సంభవించిన సందర్భాలున్నాయి. ఆదివారం జరిగిన జల్లికట్టులో పాల్గొన్న పలువురి కి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికి మాత్రం తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం. వీరిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు త రలించారు. ఈ జల్లికట్టు మద్యాహ్నం ఒక గంటకు ప్రారంభంమై 4 గంటలకు ముగుస్తుంది. ఈ పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తమిళనాడు జల్లికట్టులో విషాదం.. మదురైలో ఓ వ్యక్తి మృతి
తమిళనాడులోని మదురైలో జరిగిన జల్లికట్టులో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఎనభై మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మదురై జిల్లాలోని అవనియపురంలో జల్లికట్టు చాలా ఉత్సాహంగా జరిగింది. వందలమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అదే సంఖ్యలో క్రీడాకారులు కూడా పాల్గొని ఎద్దులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒకరు చనిపోగా... పదుల సంఖ్యలో క్రీడాకారులు గాయపడ్డారని తెలుస్తోంది. 19 ఏళ్ల క్రీడాకారుడు బాలమురగన్ ఎద్దును పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి మరణించినట్టు సమాచారం. గాయపడిన ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
జల్లికట్టులో 150 మందికి మించి పాల్గొనవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ కరోనా ప్రోటోకాల్ కాదని... వందల మంది ప్రజలు వేడుక చూసేందుకు గుమ్మిగూడారు. బాలమురగన్ కూడా అలాగే వచ్చి పోటీల్లో పాల్గొన్నాడు. అవనియపురంలో జల్లికట్టును తమిళనాడు మంత్రులు పళనివేల్ థైగ రాజన్, పీ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదురై ఎంపీ వెంకటేషన్‌తోపాటు కలెక్టర్ అనీష్ శేఖర్ పాల్గొన్నారు. మొత్తంగా 652 ఎద్దులు ఈ వేడుకలో ప్రవేశపెట్టారు. ఈ క్రీడలో పాల్గొనేందుకు సుమారు మూడు వందల మంది క్రీడాకారులను అనుమతి ఇచ్చారు. వాళ్లకు కూడా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్లనే లోపలికి పంపించారు.