Chittoor Latest News
- రికార్డు స్థాయిలో సేవ టికెట్లు విక్రయంతో ఒకరోజే 12 లక్షల ఆదాయం
- 35 వేల మంది భక్తులు అమ్మవారు దర్శించుకున్నట్లు అధికారుల అంచనా 


చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిట లాడింది.. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి వేపాకు తోరణాలతో అలంకరించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, దూప దీప నైవేద్యాలు సమర్పించి ఉదయం 5 గంటలకే భక్తులకు దర్శనం కల్పిచారు.
ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి కర్ణాటక తమిళనాడు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అమ్మవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో చంద్రమౌళి పర్యవేక్షించారు.. ఈ ఒక్కరోజు అమ్మవారికి రికార్డు స్థాయిలో వివిధ సేవా టికెట్ల ద్వారా 12 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది.. కర్ణాటక తమిళనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వాహనాలలో తరలి రావడంతో కొండంత వాహనాలతో నిండిపోయింది దాదాపు అమ్మవారిని ఆదివారం రోజు 35 వేల మంది భక్తులు దర్శించుకుని ఉంటారని అంచనా అధికారులు అంచనా వేశారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial