ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2023' పరీక్ష ఫలితాలు జులై 2న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్ట్రీమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 20న ఏపీఈసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. 


ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2023 నోటిఫికేషన్‌ మార్చి 8న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 11 నుంచి 15 వరకు. రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 12న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని జూన్ 23న విడుదల చేశారు. జూన్ 25 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. 


ALSO READ:


ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని,  ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial