Tirumala News Tpdates | తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి భారీ విరాళం లభించింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది. మంగళవారం ఉదయం ఈ మేరకు సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి బంగారు శంఖు, చక్రాలను అందజేశారు.
Tirumala Donation: తిరుమల శ్రీవారికి రూ.2.4 కోట్ల భారీ విరాళం అందించిన చెన్నై భక్తుడు
Shankar Dukanam | 29 Jul 2025 10:47 AM (IST)
Golden Conch and Chakra Donated to Tirumala Temple | తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వ్యాపారి రెండున్నర కేజీల విలువైన బంగారు శంఖు, చక్రాలు విరాళంగా సమర్పించారు.
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించిన చెన్నై భక్తుడు