Chandrababu Tirupati Tour: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన వాయిదా పడింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరగాల్సిన బాబు పర్యటన రెండు రోజుల పాటు వాయిదా పడింది. వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలో బాబు తన పర్యటనను రెండ్రోజులు వాయిదా వేసుకున్నారు. ఈ నెల 4 వ తేదీ నుండి మూడ్రోజుల పాటు తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. మే 4వ తేదీన సూళ్లూరుపేట, 5న గూడూరు, 6న వెంకటగిరి నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. పలు ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు.
'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని మళ్లీ వేగవంతం చేయాలని పార్టీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, అన్ని నియోజకవర్గాల్లో వేగవంతంగా ఈ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నాయకులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీడీపీపై ఆదరణపెంచే విధంగా ప్రయత్నాలు చేయాలని పార్టీ నేతలకు బాబు సూచనలు చేశారు.