Tirupati News: తిరునగరిలో వసతి భద్రమేనా..? ఓ ప్రైవేట్ హోటల్ లో అర్ధరాత్రి టెన్షన్ టెన్షన్

Tirupati News : తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పించే వసతిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రమాదం జరిగాక చర్యలు తీసుకునే ముందు ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.

Continues below advertisement

Tirupati News: తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని.. నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో తిరుమలకు వచ్చి వెళ్లే ప్రాంతం. తిరునగరిలో నిద్ర చేస్తే పుణ్యం కలుగుతుంది.. తిరుమల, తిరుపతి ఒక్కటే అని కోట్లాది మంది భక్తులు విశ్వశించే ప్రాంతం. అయితే ఇక్కడ వసతికి ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

తిరుపతి నగరంలో ప్రతిరోజు లక్ష నుంచి రెండు లక్షల మంది కి వరకు భక్తులు, యాత్రికులకు, ఇతర పావులు నిమిత్తం వచ్చే వారు.. ఇలా పలువుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో సుమారు 80 వేలకు పైగా వసతి పొందుతుంటారు. అధికారికంగా లగ్జరీ హోటళ్ళు సుమారు 100 వరకు ఉండగా చిన్నపాటి హోటల్స్ 200 వరకు.. అనుమతులు లేకుండా అనాధికారికంగా హోమ్ స్టేలు, లాడ్జిలు మొత్తం 700 వరకు ఉంటాయి. నగరంలో మొత్తం 1200 కు పైగా హోటల్స్, లాడ్జి లు, హోమ్ స్టేలు ఉన్నాయి. నగరంలో వీటి ఆక్యుపెన్సీ సాధారణ రోజుల్లో 40 శాతం, ప్రత్యేక రోజులు, సెలవుల సమయంలో 90 శాతం పైగా ఉంటాయి.

భద్రత ఎంత..

 హోటల్స్, హోమ్ స్టే, లాడ్జిలో వసతి పొందే వారికి భద్రత ఎంత మేర పాటిస్తున్నారనేది తెలియడం లేదు. పాడుబడిన భవనాలు, సంవత్సరాల క్రితం పునాదులు వేసిన భవనాలు, ఏళ్ల నాటి భువనాలు, చిన్నపాటి ఇరుకు సందులు, ఒకే అంతస్తులో 10 పైగా గదులు ఇలా ఏదైన అగ్నిప్రమాదం జరిగినా... చిన్నపాటి సంఘటన జరిగిన ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం లేకుండా వసతి తిరుపతిలో ఉంది. గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్న వాటిని బయటకు రానివ్వకుండా చేసే వారు.. ప్రస్తుతం ప్రమాదాలు జరిగిన వెంటనే ఏవరొక్కరు నుంచి వీడియోలు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్న వసతి కల్పించే చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది మాత్రం ఎవరికి పట్టడం లేదు.

ఏ శాఖ పర్యవేక్షణ లేదు

నగరంలో హోటల్ లేదా భవనం హోటల్, లాడ్జి, హోం స్టే గా మార్చాలంటే అనేక రకాల అనుమతులు ఉండాలి. భవనం నిర్మాణం, ఎంత మేర అది వసతికి అనుకూలంగా ఉంది, ఆ భవనం ఎన్ని సంవత్సరాల ముందు నుండి ఉంది అనే అనేక రకాల అనుమతులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు అగ్నిమాపక అధికారి నుంచి ఏదైన ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా, వాహనం ఆ మార్గంలో వచ్చే అవకాశం ఉందా.. ఎక్కువ అంతస్తులు ఉంటే అగ్ని ప్రమాదం జరిగితే వాటర్ ఫైర్ పైప్ లైన్లు ఉన్నాయా, ప్రమాదం జరిగిన చోట నుంచి మరో వైపు వెళ్లే మార్గాలు ఉన్నాయా అనే దాని పై కూడా అగ్ని ప్రమాక శాఖ అనుమతులు ఇవ్వాలి. భద్రత పరమైన అంశాలు సీసీ కెమెరాలు, ఎవరు వచ్చి వెళ్తాన్నారు అనే విషయాలపై పోలీస్ శాఖ పర్యవేక్షణ ఉండాలి.

తిరుపతి లోని హోటల్స్, లాడ్జిలపై ఏ శాఖ అధికారుల పర్యవేక్షణ అనేది ఉండడం లేదు. అటు ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలను వసతికి మార్పు చేస్తున్నారు... ఇటు ఎలాంటి అగ్ని మాపక యంత్రాలు ఉండడం లేదు.. ఇక పోలీసులు అయితే సమాచారం ఉన్నప్పుడు తనిఖీలు చేసి ఏదైన కేసులు నమోదు చేయడం, లేదా ఫొటోల కోసం అడపాదడపా తనిఖీలు చేసినట్టు ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా తనిఖీలు జరగడం లేదు.

కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం 

తిరుపతి సెంట్రల్ బస్టాండ్ సమీపంలో మినర్వా గ్రాండ్ హోటల్ లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 314 గదిలో వసతి పొందుతున్న యాత్రికులు ఉండగా ఒక్కసారిగా సీలింగ్ పూర్తిగా నేలకొరిగింది. ఆకస్మాత్తుగా జరిగిన ప్రమాదం లో ఇద్దురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన తో హోటల్ లోని ఇతరులను హోటల్ ఖాళీ చేయించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖల అధికారులు ముందుగా అనుమతులు, జాగ్రత్తలు పాటించేలా చేయాలని యాత్రికులు, భక్తులు, నగరవాసులు కోరుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

Continues below advertisement