AP Minister Roja Fires on Pawan Kalyan: 
- యువ గళమా, నారా గళమా... ??
- కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్నారు, ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారు..
- ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు చంద్రబాబు..
- వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు.
- టిడిపి నేతలు  ప్రతిపక్ష పాత్రకు కూడా అర్హులు కారు..
- ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో కు వెళ్ళాడు..
- చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని పవన్ అక్కడకు వెళ్ళారు..


తిరుపతి: యువ గళమా, ‌నారా గరళమా‌ అంటూ లోకేష్ పాదయాత్రపై ఏపి పర్యాటక‌ శాఖా మంత్రి ఆర్.కే.రోజా సెటైర్లు విసిశారు. తిరుపతిలో‌ 13వ నేషనల్‌ డాన్స్‌ స్పోర్ట్స్ ఛాంఫియన్ షిప్ పోటీలను మంత్రి ఆర్.కే.రోజా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రోజా‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై తీవ్ర స్ధాయిలో‌ మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న చంద్రబాబు (Chandrababu),‌ లోకేష్ (Nara Lokesh) లు ఏ మొహం పెట్టుకొని పాద యాత్ర చేస్తారని విమర్శించారు. ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ఆరోపించారు. 
టిడిపి నేతలు ప్రతిపక్ష పాత్రకు కూడా అర్హులు కారు
వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని కొనియాడిన ఆమె,100 కోట్లు ఖజానాతో ఉండి అప్పుల్లో ఉన్నా ఎలాంటి సాకులు లేకుండా వైసీపి‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.. టిడిపి నేతలు ప్రతిపక్ష పాత్రకు కూడా అర్హులు కారని, ఏ రోజు ఏ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో కు వెళ్ళాడని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు వెళ్ళిన తర్వాత ప్యాకేజీ తీసుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్ళారని మంత్రి రోజా మండిపడ్డారు. అలగా జనం, సంకర జాతి అంటూ పచ్చి బూతులు తిట్టిన బాలకృష్ణ షో కు పవన్  వెళ్ళాడని, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎంతటికైనా దిగజారుతారని విమర్శించారు. 
జనసేన కార్యకర్తలు బిజెపి జెండా , టిడిపి జెండా మోయిస్తున్నారని, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచన చేయండి అని మంత్రి రోజా హితవు పలికారు.. ప్రజలకు మంచి చేసే జగన్ మోహన్ రెడ్డి వెంట నడవండి అని ఆమె పిలుపు‌నిచ్చారు.. ప్రతిపక్షాలు కోడి గుడ్డుపై ఈకలు పని చేయకండని, అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాంమని‌ ఆమె గుర్తు చేశారు. టిడిపి హయాంలో 30 లక్షలు మందికి పెన్షన్లు ఇస్తే, వైసిపి అధికారం లోకి వచ్చిన తర్వాత 62 లక్షలు మందికి సంక్షేమ పథకాలు ఇస్తోందన్నారు.. రెండున్నర లక్షలు మందికి అదనంగా జనవరి నెలలో సంక్షేమం పధకాలు ఇస్తున్నట్లు చెప్పారు.. అలగ జనం, సంకర జాతి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను బాలకృష్ణ తిట్టిన వాఖ్యలు మరిచి పోయారా అంటూ‌ మంత్రి రోజా ప్రశ్నించారు.