AP Hikes Power Tariff: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల మోత ప్రారంభమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు. కరోనాతో అతులాకుతలం అయిన పేదల నడ్డి విరిచేందుకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో రంగం సిద్ధం చేసిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఆదాయం పెరుగకపోగా అదనపు భారం పెంపుపై పేద, మధ్యతరగతి వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా పెంచిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
యూనిట్లపై విద్యుత్ ఛార్జీలు ఎంత పెంచారంటే..
30 యూనిట్ల వరకు యూనిట్‌పై 45 పైసలు పెంపు
31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
75 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు 1.40 రూపాయలు
126యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు 1.57 రూపాయలు
226యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు 1.16 రూపాయలు
400యూనిట్లకుపై బడిన వాళ్లకు 55పైసలు చొప్పున పెంపు ఉంటుంది.
ఏపీ ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు.. (Andhra Pradesh New Power Tariff Details)
ప్రస్తుతం 30 యూనిట్ల వరకు రూపాయి 45పైసలు చెల్లించేవాళ్లు ఇకపై రూపాయి 90పైసలు చెల్లించాల్సి ఉంటుంది. 31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు వినియోగించేవాళ్లు ప్రస్తుతం 2 రూపాయల 9పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. పెరిగే ఛార్చీలను బట్టి అది 3 రూపాయలకు పెరగనుంది. 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లు వాడుకునే వినియోగదారులు ఇప్పటి వరకు 3రూపాయల 10 పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై వాళ్లంతా 4రూపాయల50 పైసలు చెల్లించాలి. అంటే తేడా 1.40 ఉంటుంది. 126 యూనిట్ల నుంచి 225 యూనిట్లకు విద్యుత్ ఛార్జీలు చెల్లించే వాళ్లు ఇప్పటి వరకు 4 రూపాయల 43పైసలు చెల్లించేవాళ్లు ఇకపై వాళ్లు 6 రూపాయలు చెల్లించాలి.
వినియోగదారులు 226 యూనిట్ల నుంచి 400 యూనిట్లు మధ్య వినియోగించే వినియోగదారులు ఇప్పటి వరకు 7 రూపాయల 59 పైసలు చెల్లించేవాళ్లు ఇకపై వాళ్లు 8 రూపాయల 75పైసలు చెల్లించాలి. 400 యూనిట్లపైగా వినియోగించే వాళ్లు 9 రూపాయల 20పైసలు చెల్లించేవాళ్లు. ఇకనుంచి 9రూపాయల 75పైసలు చెల్లించాల్సి ఉంటుందని తాజా టారిఫ్‌లో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి వెల్లడించారు.
శ్లాబ్ (యూనిట్లు) | ప్రస్తుత ధర (యూనిట్‌కు రూ.) | కొత్త ధర (యూనిట్‌కు రూ.) | వ్యత్యాసం (యూనిట్‌కు రూ.) |
0 - 30 | 1.45 | 1.90 | 0.45 |
31 - 75 | 2.09 | 3.00 | 0.91 |
76 - 125 | 3.10 | 4.50 | 1.40 |
126 - 225 | 4.43 | 6.00 | 1.57 |
226 - 400 | 7.59 | 8.75 | 1.16 |
400 పైగా | 9.20 | 9.75 | 0.55 |
Also Read: Guntur: 3 నెలల చిన్నారిని 6 సార్లు అమ్మేశారు! అసలు సంగతి తెలిసి అవాక్కైన పోలీసులు
Also Read: Petrol-Diesel Price, 30 March: రోజురోజుకీ ఎగబాకిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు - నేడు మరీ దారుణం