Help Desks at Tirupati and Chittoor District Collector Offices: తిరుపతి: సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆర్వో కార్యాలయాలు సిద్దమయ్యాయి. ఎన్నికల అధికారులతో పాటు పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
166- చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం, ఆర్వో ఎ.నిషాంత్ రెడ్డి, నామినేషన్ కేంద్రం- ఆర్డివో కార్యాలయం, తిరుపతి.
167- తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం, ఆర్వో అదితి సింగ్, నగరపాలక కమిషనర్, తిరుపతి, నామినేషన్ కేంద్రం - తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం
168-శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్.ఓ - ఎన్. రవి శంకర్ రెడ్డి, ఆర్డీవో శ్రీకాళహస్తి, నామినేషన్ కేంద్రం - ఆర్డీవో కార్యాలయం, శ్రీకాళహస్తి
169 - సత్యవేడు (ఎస్ సి) అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్వో - నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ , ఏ.పి.ఐ.ఐ.సి తిరుపతి, నామినేషన్ కేంద్రం- తహసీల్దార్ కార్యాలయం, సత్యవేడు
165-పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్వో - వై. మధుసుధన రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కె ఆర్ ఆర్ సి, చిత్తూరు - తహసీల్దార్ కార్యాలయం, పుంగనూరు
170- నగరి అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్వో - కె. వెంకటరెడ్డి, ఆర్ డి ఓ, నగరి - తహసీల్దార్ కార్యాలయం, నగరి
171-గంగాధర నెల్లూరు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్ఓ - సి.వెంకటశివ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఐఓసిఎల్, చిత్తూరు - తహసీల్దార్ కార్యాలయం, గంగాధర నెల్లూరు
172-చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్వో - పులి శ్రీనివాసులు, ఐ.ఏ.ఎస్., జాయింట్ కలెక్టర్ - జాయింట్ కలెక్టర్ ఛాంబర్, కలెక్టర్ కార్యాలయం, చిత్తూరు
173-పూతలపట్టు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్ఓ - జి.చిన్నయ్య, ఆర్డిఓ, చిత్తూరు - తహసీల్దార్ కార్యాలయం, పూతలపట్టు
174-పలమేనరు అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్ఓ - ఎన్. మనోజ్ రెడ్డి, ఆర్డిఓ, పలమనేరు - రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ ఛాంబర్, ఆర్డిఓ కార్యాలయం, పలమనేరు
175- కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం – ఆర్ఓ - శ్రీ జి.శ్రీనివాసులు, ఆర్డిఓ, కుప్పం - రూమ్ నెం:1, తహసీల్దార్ కార్యాలయం, డా.వై. యస్. ఆర్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, కుప్పంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
పార్లమెంటు పరిధిలో
23- తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గం - ఆర్వో - ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్- జిల్లా కలెక్టర్ కార్యాలయం, తిరుపతి.
25- చిత్తూరు (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గం - ఆర్వో - ఎస్. షణ్మోహన్, జిల్లా కలెక్టర్- జిల్లా కలెక్టర్ ఛాంబర్, కలెక్టర్ కార్యాలయం, చిత్తూరు.
ఎన్నికల పరిశీలకులు
ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది.
23 తిరుపతి పార్లమెంటరీ (ఎస్.సి), 120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121 – సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 - వేంకటగిరి, 119- సర్వేపల్లి (నెల్లూరు) అసెంబ్లీ నియోజకవర్గాలకు – జనరల్ అబ్జర్వర్ - కరే గౌడ
166 – చంద్రగిరి నియోజకవర్గం - జనరల్ అబ్సర్వర్ - కైలాష్ వాంఖడే
23-తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం.. 167- తిరుపతి, 168- శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి.) – జనరల్ అబ్జర్వర్ - ఉజ్జ్వల్ కుమార్ గోష్
23 – తిరుపతి (ఎస్. సి) పార్లమెంటు నియోజకవర్గం - ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ – శ్రీ ప్రదీప్ కుమార్
166 - చంద్రగిరి, 167 - తిరుపతి, 168 - శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) నియోజకవర్గాలకు - ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ - వి.జి శేషాద్రి
120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121 – సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 - వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు – ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ - మీను ఓల
120 – గూడూరు (ఎస్.సి.), 121 – సూళ్ళురుపేట (ఎస్.సి.), 122 – వేంకటగిరి , 166 – చంద్రగిరి , 167 – తిరుపతి, 168- శ్రీకాళహస్తి , 169 – సత్యవేడు (ఎస్.సి.), 119- సర్వేపల్లి (నెల్లూరు) అసెంబ్లీ నియోజకవర్గాలకు – పోలీస్ అబ్జర్వర్ అరవింద్ హెచ్ సాల్వే ను కేటాయించారు.
చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల పరిశీలకులు
25-చిత్తూరు (ఎస్. సి) పార్లమెంటు నియోజకవర్గం - ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ – శంకర్ ప్రసాద్ శర్మ
170-నగరి అసెంబ్లీ, 171-జి.డి. నెల్లూరు (ఎస్. సి) అసెంబ్లీ నియోజకవర్గాలకు – జనరల్ అబ్జర్వర్ – కైలాశ్ వాంఖడే
172-చిత్తూరు, 173-పూతలపట్టు (ఎస్. సి), 174-పలమనేరు మరియు 175-కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు – జనరల్ అబ్జర్వర్ - ఎం.డి షాధిక్ అలం
165 పుంగనూరు, 170-నగరి, 171- జి. డి నెల్లూరు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాలకు - ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ – ఎస్. శ్రీనివాస్ ఖన్నా
172-చిత్తూరు, 173-పూతలపట్టు (ఎస్.సి), 174-పలమనేరు 175-కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు - ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ – రోహన్ ఠాఖుర్
170-నగరి, 171- జి. డి నెల్లూరు (ఎస్.సి), 172-చిత్తూరు, 173-పూతలపట్టు (ఎస్. సి), 174-పలమనేరు, 175-కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు – పోలీస్ అబ్జర్వర్ – అరవింద్ హెచ్ సాల్వే కేటాయించారు. తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.