APRS CAT, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

APREIS: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది.

Continues below advertisement

APREIS Exam Halltickets: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో  5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షలను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

Continues below advertisement

➥ ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం 'ఏపీఆర్‌ఎస్ క్యాట్-2024' నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభంకాగా.. విద్యార్థుల నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

APR Fifth Class Halltickets..

APRS Backlog Vacancy(6th,7th, & 8th)..

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

➥ ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRJC CET) - 2024 నోటిఫికేషన్‌ మార్చిన విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించనున్నారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్‌ మే 22 నుంచి 25 వరకు; మే 28  నుంచి 30 వరకు రెండో విడత; జూన్‌ 5 నుంచి 7 వరకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 

APRJC CET 2024 Hallticket..

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

➥ ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీఆర్‌డీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRDC CET)-2024కు మార్చి 1న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించనున్నారు. అనంతరం సీట్ల భర్తీ కోసం తొలి విడత కౌన్సెలింగ్‌ మే 23న, రెండో విడత కౌన్సెలింగ్‌ మే 31న, మూడో విడత కౌన్సెలింగ్‌ జూన్ 7న నిర్వహించనున్నారు. 

APRDC CET 2024 Hallticket..

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement