CM Jagan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు వీరుడు అని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ శూరుడు అంటూ ఏపీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్లు అన్నీ కలిసి వస్తున్నాయని.. విష ప్రచారాలు అస్సలే నమ్మొద్దు అంటూ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పేద ప్రజలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. ప్రతీ పేదవారి గుండెలో స్థానం కోసం పని చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 


"తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మకండి. దత్తపుత్రుడి కోసం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ కల్యామ్ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవారి గుండెలో స్థఆనం కోసం పని చేస్తున్నాం" - ఏపీ సీఎం జగన్






 1992వ సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు హెరిటేజ్ డెయిరీని ప్రారంభించిన త‌ర్వాత‌.. స‌హ‌కార రంగంలో ఉన్న అతిపెద్ద‌ చిత్తూరు డెయిరీని ప‌థ‌కం ప్ర‌కారమే న‌ష్టాల బాట ప‌ట్టించారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. 2002లో ఏకంగా మూత పడేలా చేశారన్నారు. ఇదంతా చంద్ర‌బాబు సొంత డెయిరీ బాగుకోసమేనని చెప్పుకొచ్చారు.  సొంత జిల్లా పాడి రైతుల‌ను నిలువునా ముంచేసిన ప‌రిస్థితి ఉందని ఆరోపించారు. అలాగే 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుందన్నారు. చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామన్నారు. 






అమూల్ రాక ముందు లీటర్ గేదె పాల ధర రూ.67, అమూల్ వచ్చాక లీటర్ గేదె పాల ధర 89 రూపాయల 76 పైసలు, అమూల్ రాక ముందు ఆవుపాలు లీర్ ధర రూ.32 కూడా లేదన్నారు. అమూల్ వచ్చాక ఆవుపాలు లీటర్ ధర 43 రూపాయల 69 పైసలు, వెల్లూరు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీ రావు అని... అడ్డంకులను దాటి వెల్లూరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాకు చెంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.  అమూల్ చిత్తూరు డెయిరీ ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial