Nara Lokesh: రాష్ట్రంలోని సహకార డెయిరీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి అప్పనంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి రైతుల సంక్షేమానికి తూట్లు పోడిచేలా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారని విరుచుపడ్డారు. అమూల్‌కు జగన్ మోహన్ రెడ్డి దాసోహమయ్యారని ఆరోపించారు. 1990వ దశకం ప్రారంభంలో అతిపెద్ద పాల కేంద్రాలలో ఒకటైన చిత్తూరు డెయిరీ నష్టాల కారణంగా మూతపడిందని నారా లోకేష్ గుర్తు చేశారు. 2005లో అప్పటి దివంగత సీఎం రాజశేఖర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన హౌస్‌ కమిటీ విచారణ జరిపి నష్టాల వల్లే డెయిరీ మూత పడిందని తేల్చిందన్నారు. 






అయితే 99 ఏళ్ల పాటు డెయిరీని ఏడాదికి కోటి చొప్పున అమూల్‌కు సీఎం జగన్ ఇచ్చేశారన్నారు. డెయిరీకి చెందిన 28 ఎకరాలు, చిల్లింగ్ సెంటర్లు కట్టబెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. డెయిరీ ఆస్తుల విలువ రూ. 700 కోట్లకు పైగా ఉందన్నారు. ప్రజా సంపదను కొల్లగొట్టేస్తూ తన అనుచరులకు కట్టబెట్టేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమంపై  జగన్‌కు విశ్వసతనీయత లేదని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ ‘ప్రతీకార రాజకీయాలకు’ ప్రజా వేదిక, అమరావతి రాజధాని ఉదాహరణలే నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. జగన్ రాజకీయ పగతో రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. జగన్ ప్రతీకార రాజకీయాలు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టాయని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






అలాగే నమ్మించి భూస్థాపితం చేయడం అంటే ఇదేనేమో అంటూ ఏపీ టీడీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తానని చెప్పిన సీఎం జగన్..ఇప్పుడు తన స్వార్థం కోసం రూ.600 కోట్ల విలువైన చిత్తూరు డెయిరీ ఆస్తులని ఏకంగా 99 ఏళ్లకు గుజరాత్ సంస్థ అమూల్ కు నామమాత్ర ధరకు అప్పనంగా ఇచ్చేశాడంటూ ఫైర్ అయ్యారు. ఇంకెప్పటికీ కోలుకోలేని దెబ్బకొట్టాడంటూ తెలిపారు.