Tiruapti News : తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయింది. గంటల తరబడి విద్యుత్ కోతలతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లను పక్క వార్డ్ కి మారుస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది. విద్యుత్ లేకపోవడంతో పేషెంట్ల సహాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి లోపల ఏమి జరుగుతుందో తెలియక బయట పేషెంట్ల బందువులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పేషెంట్ల ప్రాణాలు కాపాడాలంటూ వారి బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్  అయింది. 



రోడ్డుపై బైఠాయించి ఆందోళన


తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడంతో పేషెంట్ల సహాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగ్గారు. సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు రెండు గంటల సేపు విద్యుత్ రాకపోవడంతో పేషంట్లు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ముగ్గురు పసికందులు, ఓ మహిళను రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి జనరేటర్ గదిలో షాట్ సర్క్యూట్ అయి విద్యుత్ నిలిచిపోయింది. ఈ ప్రాంతాన్ని సిబ్బంది గుర్తించడంలో ఆలస్యం కావడంతో గంటల తరబడి ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కలిగింది. దీంతో పేషంట్ల బంధువులు రుయా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ల బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగ్గారు. విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ ప్రసూతి ఆసుపత్రికి చేరుకుని పేషెంట్ల బంధువులకు సర్ది చెప్పారు. 


షార్ట్ సర్క్యూట్ కారణంగా 


దీంతో హుటాహుటిన షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రాంతంలో మరమ్మత్తులు నిర్వహించారు. విద్యుత్ రావడంతో పేషెంట్ల బంధువులు ఆందోళన విరమించారు. ప్రసూతి ఆసుపత్రిలో అధికారులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పేషంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జాయింట్ కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జనరేటర్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. అయితే అత్యవసర విభాగంలో ఉన్న ఓ మహిళ, ముగ్గురు పసికందులను అత్యవసర చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రి తరలించామన్నారు. 


ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. కరోనా తర్వాత విద్యుత్ వినియోగం పెరిగిందని గ్రిడ్ దెబ్బతినకుండా పవర్ కట్స్ విధిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గంట తరబడి విద్యుత్ కోతలు ఉంటున్నారు. పట్టణాల్లో కరెంట్ కోతలు ఉంటున్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం పవర్ హాలిడేస్ ప్రకటించింది. జాతీయ ఎక్స్ ఛేంజీల్లో విద్యుత్ కోరత, వేసవి విద్యుత్ డిమాండ్ పెరగడంతో విద్యుత్ కోతలు తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రులకు కరెంట్ కోతలు విధిస్తుండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్ల సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.