Tirupati Janasena leader Kiran Royal in Trouble: తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ వివాదంలో చిక్కుకున్నారు.  బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేశారని ఆత్మహత్యాయత్నం చేసింది.  ఆ మహిళను తిరుపతి బైరాగపట్టడుగు చెందిన లక్ష్మీ గా గుర్తించారు.  తనకు  కిరణ్ రాయల్ తో సన్నిహిత సంబంధం ఉందని  వీడియోలో ఆ మహిళ చెప్పుకున్నారు. అనేక దఫాలుగా కోటి 20 లక్షల రూపాయల వరకు కిరణ్ రాయల్ కు అప్పుగా ఇచ్చానని చెప్పారు. అయితే తాను ఇచ్చిన డబ్బులను కిరణ్ రాయల్ తిరిగి ఇవ్వడం లేదని ఆమె అంటున్నారు. 

2022 సంవత్సరం నుంచి కిరణ్ రాయలకు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోందని తెలుస్తోంది.   కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తనను బెదిరించి 30 లక్షల రూపాయలకు చెక్కులు బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతాడని బెదిరిస్తున్నానని  ఆరోపించారు.  కిరణ్ రాయల్ వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది.   ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను ప్రస్తుతం వేలూరు ఆస్పత్రిలో చేర్పించినట్లుగా చెబుతున్నారు.                 

ఈ వివాదంపై కిరణ్ రాయల్ స్పందించ చారు. వైసీపీ నేతలు కుట్ర ప్రకారం ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఆమెపై చాలా కేసులు ఉన్నాయని వాటికి సంబంధించిన ఎఫ్‌ఐర్‌ కాపీలు కూడా తన వద్ద ఉన్నట్టు తెలిపారు. ఆమె బెట్టింగ్‌లు ఆడించి చాలా మందిని ముంచేశారని వాళ్లంతా కేసులు పెట్టారని అన్నారు. జైపూర్ పోలీసులు వచ్చి విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. వైజాగ్‌లో సీఐడీ కేసు కూడా ఉందన్నారు. 

భూమన అభినయ్‌రెడ్డి ఇదంతా ఆడిస్తున్నారని కచ్చితంగా అసలు విషయాలు వెలుగులోకి తీసుకొస్తామన్నారు. అసలు అభినయ్‌ రెడ్డి బాగోతం తమ వద్ద ఉందని వాటిని త్వరలోనే బయటపెడతామన్నారు కిరణ్‌ రాయల్. మహిళలను అడ్డం పెట్టుకొని వైసీపీ చేసే చిల్లర రాజకీయాలకు బెదిరింపులకు బయపడే వాళ్లం కాదని సమాధానం చెప్పారు.  

 కిరణ్ రాయల్  పవన కల్యాణ్ వీరాభిమాని. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుటి  నుంచి ఆయన వెంటే నడిచారు. తిరుపతిలో జనసేన పార్టీకి అన్నీ తానై నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి సీటు..  జనసేన పార్టీకి కేటాయించడం ఖాయమయినప్పుడు అభ్యర్థిగా ఆయన పేరే వినిపించింది. అయితే చివరి నిమిషంలో వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరడంతో ఆయనకు తిరుపతి టిక్కెట్ ఖరారు చేశారు పోటీ చేసి భారీ మెజార్టీతో ఆరణి విజయం సాధించారు. 

Also Read : CM Chandrababu: 30 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తు చేసుకుని సీఎం చంద్రబాబుపై నీతి ఆయోగ్ చైర్మన్ ప్రశంసలు

టిక్కెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం కిరణ్ రాయల్ పని చేస్తున్నారు. మహిళ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై జనసేనాని పూర్తి వివరాలు తెప్పించుకుని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గతంలో ఇలాగే జానీమాస్టర్ పై మరో డాన్సర్ కేసు పెట్టడంతో జనసేన పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే ఇక్కడ ఆర్థిక పరమైన వివాదాల వల్ల ఈ వీడియో రిలీజ్ చేశారని భావిస్తున్నారు. అందుకే  పూర్తి వివరాలను జనసేనాని తెప్పించుకునే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. 

Also Read : YS Sharmila On jagan : జగన్ క్రెడిబులిటి ఖాళీ బాటిల్, సున్నా - బిడ్డల ఆస్తులు కాజేయాలని కుట్ర - షర్మిల సంచలన వ్యాఖ్యలు