Sharmila alleged that Jagan had conspired to get the children  property: జగన్మోహన్ రెడ్డి తన సొంత మేనల్లుడు,మేన కోడలు ఆస్తులు కాజేయ్యలని కుట్రలు చేశాడని సోదరి షర్మిల ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ సాయిరెడ్డి తో చాలా విషయాలు చర్చకు వచ్చాయని..  జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారని షర్మిల తెలిపారు.  నా బిడ్డలకు సంబంధించిన ఒక విషయం చెప్తున్నానని..  జగన్  సొంత తల్లి మీద, కేసు పెట్టించారుి..  జగన్  కుట్రను తాను బయట పెట్టానన్నారు. స్వయంగా విజయమ్మ లేఖ కూడా రాశారని.. తాను  నిజాలు చెప్పాను అని జగన్ నా మీద అబద్ధాలు చెప్పాలని సాయి రెడ్డి కి చెప్పాడన్నారు.  సాయి రెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారని..  స్వయంగా సాయి రెడ్డికి జగన్ కాల్ చేసి..  ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేశారన్నారు.  కుదరదు అని సాయి రెడ్డి చెప్తే జగన్ ఒప్పుకోలేదని..   వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉంది అని సాయి రెడ్డి చెప్పాడన్నారు. 


అందరి సమక్షంలో జరిగిన నిర్ణయం అని సాయి రెడ్డి చెప్పాడని.. తనను వదిలేయమని సాయి రెడ్డి వేడుకొంటే సుబ్బా రెడ్డి తో మాట్లాడించారన్నారు.  సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ సాయి రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారని..  నాకు ఇష్టంలేదు అని సాయి రెడ్డి వేడుకున్నా వదిలి పెట్టలేదని షర్మిల ఆరోపించారు.  ఈ విషయం స్వయంగా సాయి రెడ్డి చెప్పారని షర్మిల ప్రకటించారు.  సాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలు అన్ని స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని.. 40 నిమిషాల పాటు జగన్ చెప్తుంటే నోట్ చేసుకున్నాడని తెలిపారు.  జగన్ నైజం ఇదే అని సాయి రెడ్డి అర్థం చేసుకున్నారననారు.  సాయి రెడ్డి చెప్తుంటే చాలా బాధ వేసిందని.. - జగన్ ఇంతలా దిగజారాలా.. - వైఎస్ఆర్ కొడుకు అయ్యి ఉండి క్యారెక్టర్ దిగజారాలా  అని ప్రశ్నించారు. 


క్యారెక్టర్ లేని జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడని..  క్యారెక్టర్ మీద డైలాగ్ లు చెప్తున్నాడని షర్మిల మండిపడ్డారు.  క్యారెక్టర్ అనే పదం అర్థం కూడా జగన్ కి తెలియదన్నారు.  మీ క్యారెక్టర్ ఏంటో మీరే ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. సాయి రెడ్డి వదిలేయమని బ్రతిమిలాడితే ఒత్తిడి చేయడం మీకు క్యారెక్టర్ ఉన్నట్లా ? అని ప్రశ్నించారు. - వైఎస్ఆర్ కుటుంభం పరువు తీయొద్దు అని వేడుకుంటే అబద్ధాలు చెప్పించిన మీకు క్యారెక్టర్ ఉన్నట్లా ? మీరే స్వయంగా అబద్ధాలు రాసి ఇవ్వడం క్యారెక్టర్ ఉన్నట్లా ? అని ప్రశ్నించారు. జగన్  మీది మహోన్నతమైన క్యారెక్టర్...- ఆస్తుల్లో సమాన వాట ఉందని మన కుటుంబంలో అందరికీ తెలుసు.. సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తి కాజేయ్యాలని చూశాడన్నారు.  ఆస్తులు కాజెయ్యడానికి కుట్రలు పన్నారుని..   మీరు చేసిన కుట్రలు ఏంటో ఆత్మ పరిశీలన చేస్కోవాలని సలహా ఇచ్చారు.  మీ క్యారెక్టర్ ఏంటో ఆలోచన చేసుకోవాలన్నారు. ఆస్తుల కోసం ఎంత దిగజారి పోయారో ఆలోచన చేయండని సూచించారు. 


జగన్ గారి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని..  అబద్ధాలు ఆడకూడదు అంట.. విలువలు,విశ్వసనేయత ఉండాలట.. పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం ఆలోచన చేయాలట.. వెన్నుపోటు పొడవకూడదు అంట అని ఎద్దేవా చేశారు.  సాయి రెడ్డి చేత అబద్ధాలు చెప్పించలేదా ?  ప్రజలను అవే నిజాలు అని నమ్మించ లేదా ?  సొంత తల్లి మీద స్వార్థం కోసం కేసు పెట్టలేదా ?  ఆస్తికోసం ఏదైనా చేయొచ్చు అనుకోలేదా ?  సొంత చెల్లికి మీరు వెన్నుపోటు పొడిచిన..మీకు క్రిడిబులిటి ఉందా ? అని ప్రశ్నించారు.  వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ మీరు. - మీరు వెన్నుపోటు గురించి చెప్తుంటే... రెండు వేళ్ళు మీవైపు కూడా చూపిస్తాయన్నారు. 


వైఎస్ఆర్ బీజేపీ కి వ్యతిరేకి .. ఇప్పుడు అదే బీజేపీ తో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారన్నారు.   వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రాజెక్టు లు మొదలు పెడితే...6 నెలల్లో పూర్తి చేస్తాం అన్నారు. మీకు క్రిడిబులిటీ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.  నాసిరకం మందు అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడే మీకు క్రెడిబులిటీ లేదని అర్థం అయిందన్నారు.  సొంత చిన్నాన్న ను హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నప్పుడే పోయింది మీకు విశ్వసనీయత అని తేల్చేశారు.  రుషికొండ ను తొలిచి 500 కోట్లతో ప్యాలెస్ కట్టినప్పుడే ..- ఆస్తులు కాజేయాలని చూసినప్పుడే  సొంత తల్లిని అవమానించినప్పుడే విశ్వసనీయత పోయిందన్నారు. 


ఎన్నికల్లో జగన్ చేతులు కాల్చుకున్నాడు .. ఇప్పుడు బీద ఏడుపులు ఏడుస్తున్నాడు..కార్యకర్తలను అడుక్కుంటున్నాడు.. జగన్ క్యారెక్టర్ ఖాలి బాటిల్.. జగన్ క్యారెక్టర్ సున్నా అని షర్మిల తేల్చేశారు.