Rajasekhar Jeevitha :  సినీ నటులు జీవిత, రాజశేఖర్ పై గరుడ వేగ నిర్మాత, జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ హేమా, కంపెనీ ఫౌండర్ కోటేశ్వరరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హేమా మాట్లాడుతూ.. జీవిత, రాజశేఖర్ చాలా మంచి మనుషులుగా బయటి ప్రపంచంలో చలామణి అవుతున్నారని, కానీ వారి వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని హేమా ఆరోపించారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ వల్ల జీవిత, రాజశేఖర్ తో పరిచయం అయ్యామన్నారు. జోస్టర్ ఫిలిం గ్రూప్స్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమయంలో పీఎస్-4 గరుడ వేగ సినిమా తీసామని తెలిపారు. రాజశేఖర్ తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.26 కోట్లు అప్పు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. తమ వద్ద ప్రాపర్టీ పెట్టి మోసం చేశారని చెప్పారు. 



(జీస్టర్ గ్రూప్ ఛైర్మన్ హేమా, ఫౌండర్ కోటేశ్వరరాజు)


రాజశేఖర్ పై క్రిమినల్ కేసు 


తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో రాజశేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారని, త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్లనున్నట్లు జీస్టర్ గ్రూప్స్ కంపెనీ ఫౌండర్ కోటేశ్వరరాజు తెలిపారు. సినిమా కోసం డబ్బు పెడితే సంజయ్ రామ్ కు తమ సినిమాను అమ్ముకున్నారని, ఇదే విషయాన్ని రాజశేఖర్, జీవితలను ప్రశ్నించినా వారు ఎటువంటి సమాధానం చెప్పలేదన్నారు. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి అని, అవకాశం కోసం వాళ్లిద్దరూ తమను వాడుకున్నారని ఆరోపించారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చెక్ బౌన్స్ అయిన కేసులో నగిరి పోలీసు స్టేషన్ లో జీవిత, రాజశేఖర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు. 


Also Read : Chandrababu Notice : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన, చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు


స్పందించిన జీవిత, రాజశేఖర్


ఈ ఆరోపణలపై సినీ నటుడు రాజశేఖర్, జీవిత స్పందించారు. తమపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.  వీటిపై రేపు (శనివారం) జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తానన్నారు. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయొవద్దని కోరారు.


Also Read : TRS Leader Murder Case: నల్లబెల్లం తీసింది ప్రాణం- కౌన్సిలర్‌ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు