శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. 13 జిల్లాల నుంచి రోజుకు సుమారు వెయ్యి మంది వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు చెందిన భ‌క్తుల‌కు టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించనుంది. అక్టోబ‌రు 7 నుంచి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి శ్రీవారి బ్రహ్మోత్సవ ద‌ర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనంతో పాటు తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మవారి ద‌ర్శనం కల్పించస్తామని టీటీడీ తెలిపింది. హిందూ ధ‌ర్మాన్ని ప్రచారం చేసేందుకు, మ‌త మార్పిడులు అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ద్వారా ఓ సేవా ఫౌండేష‌న్ సహకారంతో టీటీడీ మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. 


Also Read: TTD: తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం


ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు


ఈ ఆల‌యాలు నిర్మించిన వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుండి బ్రహ్మోత్సవాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 బ‌స్సులు ఏర్పాటు చేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకువస్తున్నారు. తూర్పుగోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో 20 బ‌స్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఒక్కో బ‌స్సులో ఇద్దరు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు మార్గం మధ్యలో స్థానిక దాతల స‌హ‌కారంతో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది.


Also Read: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి


శ్రీవారి బ్రహ్మోత్సవాలు


తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తేదీలను ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ప్రకటించింది. కొవిడ్‌ నిబంధనలు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహనసేవల వివరాలను టీటీడీ ప్రకటించింది.


Also Read: అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఈ ఏడాది ఏకాంతంగానే సేవలు.. ఆ జిల్లాల భక్తులకు గుడ్ న్యూస్


వాహనసేవలు



  • 06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వ‌ర‌కు)

  • 07-10-2021: ధ్వజారోహణం(ఉదయం)- పెద్దశేష వాహనసేవ(సాయంత్రం)

  • 08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ(ఉదయం)- హంస వాహనసేవ(సాయంత్రం)

  • 09-10-2021: సింహ వాహ‌నసేవ(ఉదయం)- ముత్యపుపందిరి వాహ‌నసేవ(సాయంత్రం)

  • 10-10-2021:  క‌ల్పవృక్ష వాహ‌నసేవ(ఉదయం)-సర్వభూపాల వాహనసేవ(సాయంత్రం)

  • 11-10-2021: మోహినీ అవ‌తారం(ఉదయం)- గ‌రుడ‌ వాహనసేవ‌(సాయంత్రం)

  • 12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ(ఉదయం)- గ‌జ వాహ‌నసేవ(సాయంత్రం)

  • 13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ(ఉదయం)- చంద్రప్రభ వాహ‌నసేవ(సాయంత్రం)

  • 14-10-2021: రథోత్సవం బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ(ఉదయం)- అశ్వ వాహ‌నసేవ(సాయంత్రం)

  • 15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)


Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనం.. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ


దర్శన టికెట్లు ఉంటేనే అనుమతి


శ్రీవారి దర్శనానికి దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు తితిదే ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ టీకా సర్టిఫికెట్, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉండాలని తెలిపింది. చాలా మంది దర్శన టికెట్లు లేకుండా అలిపిరి నుంచి వెనుదిరుగుతున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఉచిత సర్వదర్శనం, వర్చువల్‌ సేవలు, శ్రీవాణి ట్రస్టు ద్వారా జారీ చేసే దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. దీంతో పాటుగా ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్, లేదా 72 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను తీసుకురావాలని సూచించింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి